శిక్షల పెంపుతోనే సమాజంలో మార్పు - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాయంలో వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన కోర్ట్ విధులు నిర్వహించే పోలీస్ అధికారులను అభినందించి రివార్డులు ప్రశంశ పత్రాలు అందజేశారు.

 Change In Society Only With Increase In Punishment Sp Akhil Mahajan,sp Akhil Mah-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.పోలీస్ అధికారులు నిరంతరం పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలిస్తూ, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

పోక్సో, హత్య కేసులను ప్రధానమైనవిగా భావించి ముందుకు సాగాలని ప్రతి కేసుల్లో పంచనమ చేసే సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఫోటోలు వివరాలు సమగ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.సాంకేతికత ప్రస్తుత రోజుల్లో కీలకంగా మారిందని అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జమ చేయాలన్నారు.

కోర్టు కేసులకు సంబంధించిన ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదుపడేలా కృషి చేయాలని శిక్షల శాతం పెరిగేలా పనిచేసే అధికారులను సిబ్బందికి రివార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి జైలు శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం జరిగిందని తెలిపారు.

ఇందులో వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు విధించడం జరిగిందని, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి గంజాయి కేసులో సంవత్సరం జైలు శిక్ష,5000 రూపాయల జరిమానా, తంగాళ్లపల్లి పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఆక్సిడెంట్ కేసులో ఒకరికి 6 నెలల జైలు శిక్ష,2000 రూపాయల జరిమాన,శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం జరిగిందని తెలిపారు.పై కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన సి.

ఎం.ఎస్ ఎస్.ఐ శ్రీనివాస్,హెడ్ కానిస్టేబుల్ విష్ణుమూర్తి,కానిస్టేబుల్ లు నరేందర్,అవినాష్,వేములవాడ కోర్టు కానిస్టేబుల్ సురేష్, ముస్తాబాద్ కోర్ట్ కానిస్టేబుల్ దేవేందర్, తంగాళ్లపల్లి కోర్టు కానిస్టేబుల్ తిరుపతి లను జిల్లా ఎస్పీ అభినందించి సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube