అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమలా హారిస్‌ రంగ ప్రవేశం, ట్రంప్ శిబిరం అలర్ట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోంచి అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) తప్పుకోవడంతో అగ్రరాజ్యంలో రాజకీయాలు వేడెక్కాయి.బైడెన్‌కు బదులుగా డెమొక్రాటిక్ పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష బరిలో నిలుస్తారంటూ చర్చ జరుగుతోంది.

 Us Presidential Election Trump Pollster Warning His Team That Harris Is Going To-TeluguStop.com

ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌‌కు( Kamala Harris ) అనూహ్యంగా మద్ధతు పెరుగుతోంది.పార్టీలోని సీనియర్ నేతలు, ఇండియన్ కమ్యూనిటీ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.

డెమొక్రాట్ పార్టీ( Democratic Party ) పాలిత రాష్ట్రాల గవర్నర్లు, తాజా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలవాలని అనుకున్న వారు కమలా హారిస్‌కు మద్ధతు తెలుపుతున్నారు.అద్భుతం జరిగితే తప్పించి.

కమల అభ్యర్ధిత్వం దాదాపు ఖరారైనట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఈ పరిణామాలతో ట్రంప్( Trump ) శిబిరం అలర్ట్ అయ్యింది.

ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ శ్రేణులకు, మద్ధతుదారులకు రహస్యంగా ఓ లేఖ రాసింది.అప్రమత్తంగా ఉండాలని, కమలా హారిస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించింది.

Telugu Democratic, Donald Trump, Harris, Joe Biden, Kamala Harris, Republican, T

బైడెన్ అధ్యక్ష బరిలో ఉండటంతో పాటు ఇటీవల హత్యాయత్నం , తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో దూకుడు తదితర కారణాలతో నిన్న మొన్నటి వరకు ట్రంప్‌కు పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన ప్రచార బృందంలోని టోనీ ఫ్యాబ్రీజియో లేఖలో ప్రస్తావించారు.కానీ కమలా హారిస్ రంగ ప్రవేశంతో పోల్స్, సర్వేలన్నీ ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.అయితే పోల్స్‌లో ఆధిపత్యం ప్రదర్శించినంత మాత్రాన హారిస్.ఎన్నికల్లో గెలుస్తారని అనుకోవడానికి లేదన్నారు.

Telugu Democratic, Donald Trump, Harris, Joe Biden, Kamala Harris, Republican, T

బైడెన్ పరిపాలనలో ఆర్ధిక వ్యవస్ధ గాడితప్పడం, అధిక ద్రవ్యోల్బణం, నేరాలు , అక్రమ వలసలు, గృహ వ్యయం, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, హమాస్ – ఇజ్రాయెల్ యుద్ధం తదితర అంశాలు డెమొక్రాట్లపై ప్రభావం చూపుతాయని టోనీ వ్యాఖ్యానించారు.వీటిలో బైడెన్‌కు డిప్యూటీగా హారిస్ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారని ఆయన పేర్కొన్నారు.కమలా హారిస్‌ను ఘాటు పదజాలంతో దూషించవద్దని.ఆమెపై జాత్యహంకార, లింగ వివక్ష వ్యాఖ్యలు చేస్తే ఇబ్బందులు తప్పవని టోనీ ఫ్యాబ్రీజియో హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube