అనంత్ అంబానీకి 40 కోట్ల విలువైన ఫ్లాట్ కానుకగా ఇచ్చిన స్టార్ హీరో?

భారత కుబేరుడు ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) ఇంట ఇటీవల పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ( Anant Ambani ) రాధిక మర్చంట్( Radhika Merchant ) వివాహపు వేడుకలు అంబరాన్ని తాకాయి.

 Shahrukh Khan Gives Costly Wedding Gift To Ananth Ambani Details,ananth Ambani,-TeluguStop.com

ఎంతో ఘనంగా సుమారు 5000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వివాహపు వేడుకలు చాలా సాంప్రదాయ బద్దంగా జరిగాయి.ఇక ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు కదిలి వచ్చారు.

ఇక మన చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

Telugu Cr, Akshay Kumar, Anantambani, Ananth Ambani, France, Salman Khan, Sharuk

ఈ విధంగా ముఖేష్ అంబానీ కుమారుడి వివాహపు వేడుకలలో సౌత్ సెలబ్రిటీలతో పాటు నార్త్ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు అనంత్ అంబానికి చాలా మంచి స్నేహితులు కావడంతో వారి కోసం రెండు కోట్ల రూపాయల విలువ చేసే వాచ్లను కానుకలుగా అందజేశారు.ఇక ఈ పెళ్లికి వెళ్లిన బాలీవుడ్ హీరోలు కూడా పలువురు అనంత్ అంబానీకి ఎంతో విలువైన కానుకలు అందజేశారు అని తెలుస్తుంది.

Telugu Cr, Akshay Kumar, Anantambani, Ananth Ambani, France, Salman Khan, Sharuk

ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) దంపతులు ఏకంగా ఫ్రాన్స్ లో 40 కోట్ల రూపాయల విలువ చేసే ఒక అపార్ట్మెంట్ అనంత్ అంబానీకి పెళ్లి కానుకగా అందించారని తెలుస్తోంది.అలాగే దీపిక రణవీర్ దంపతులు 20 కోట్ల రూపాయల విలువచేసే రోల్స్ రాయిస్ కారును అందజేశారట, అక్షయ్ కుమార్ 60 కోట్ల రూపాయల గోల్డెన్ పెన్, కత్రినా విక్కీ కౌశల్ 16 లక్షల విలువచేసే గోల్డ్ చైన్, సల్మాన్ ఖాన్ 15 కోట్ల విలువచేసే బైక్, అలియా రణబీర్ దంపతులు 9 కోట్ల రూపాయల విలువచేసే ఖరీదైన కారును అనంత్ అంబానీ పెళ్లి కానుకగా అందజేశారని తెలుస్తోంది.ఇలా బాలీవుడ్ తారలందరూ కూడా పెద్ద ఎత్తున విలువైన కానుకలను అందించినట్టు వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube