వీడియో: వాననీళ్లు మైక్రోస్కోప్‌తో చూస్తే ఎలా కనిపిస్తాయో తెలుసా..

మన చుట్టూ జరిగే విచిత్రమైన విషయాల వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి.ఈ వీడియోలను చాలా మంది నెటిజన్లు షేర్ చేస్తుంటారు.

 Have You Ever Seen Rain Water Under A Microscope Video Viral Details, Viral Vide-TeluguStop.com

ఇలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సాధారణంగా మనలో అందరం వర్షపు నీటిని( Rain Water ) చూసే ఉంటాం కానీ, వాటిని మైక్రోస్కోప్( Microscope ) ద్వారా చూస్తే ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూశారా? చూడలేదు కదా.తరచుగా తడిచే ఈ వర్షపు చినుకుల్లో ఏముంటుందని అనేది చూడాలనే ఆసక్తి మాత్రం ఉంటుంది.అందుకే ఒకరు ఇలాంటి ఒక చేసి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

చాలామందికి వర్షంలో తడవడం ఇష్టం కానీ వర్షపు నీళ్లలో ఏముంటుందో చూస్తే షాక్ కాక తప్పదు.ఈ వీడియోను ‘మైక్రో జూమ్ గై’( Micro Zoom Guy ) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు.

ఈ యూజర్ తరచుగా వింత వింత వస్తువులను మైక్రోస్కోప్ ద్వారా చూపించే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు.ప్రస్తుత వీడియోలో ఒక వ్యక్తి తన ఇంటి బయట పైకప్పు నుంచి వర్షపు నీటిని సేకరిస్తున్నాడు.

అతను ఆ నీటిని ఒక సీసాలో నింపి, కొన్ని చుక్కలను ఒక శాంపిల్ జార్‌లో వేస్తాడు.

ఆ తర్వాత ఆ గ్లాస్ జార్‌ను మైక్రోస్కోప్ కింద ఉంచుతాడు.మైక్రోస్కోప్ ద్వారా చూస్తే, ఆ నీటిలో వివిధ రకాల సూక్ష్మజీవులు కనిపిస్తాయి.ఈ వీడియోకు ఆ వ్యక్తి “మీరు ఎప్పుడైనా వర్షపు నీటిని మైక్రోస్కోప్ కింద చూశారా?” అని క్యాప్షన్ పెట్టాడు.ఈ వీడియోను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవడంతో చాలా మంది కామెంట్లు చేశారు.ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.85 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీనిపై చాలా మంది యూజర్లు తమ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా వ్యక్తం చేశారు.

ఒక యూజర్ “ఇది కచ్చితంగా సరైనది కాదు.వర్షపు నీటిని సేకరించడానికి వర్షం కొలవడానికి ఉపయోగించే పరికరం ఉపయోగించాలి.ఇంటి పైకప్పు నుంచి లేదా గట్టర్ నుంచి కాదు,” అని వ్యాఖ్యానించారు.

మరొక యూజర్ “సాంకేతికంగా అది సరైనది కాదు ఎందుకంటే అది మీ ఇంటి నుంచి వస్తుంది, ఆకాశం నుంచి కాదు,” అని రాశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube