టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) హీరోయిన్లను రిపీట్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది.అనుష్క మినహా ప్రభాస్ తో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసిన హీరోయిన్లు దాదాపుగా లేరనే చెప్పాలి.
ప్రభాస్ హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పాకిస్తాన్ హీరోయిన్( Pakistan Heroine ) అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వైరల్ అవుతున్న ఈ వార్తలు కొంతమంది అభిమానులకు చిరాకు తెప్పిస్తున్నాయి.ప్రభాస్ ఇప్పటికే కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమాలు పూర్తి కావాల్సి ఉంది.
ప్రభాస్ హను రాఘవపూడి సినిమా కోసం ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.పాకిస్తాన్ లో చాలా ఫేమస్ అయిన సజల్ అలీని( Sajal Ali ) ఈ సినిమాలో ఎంపిక చేశారు.
![Telugu Pakistan, Prabhas, Prabhashanu, Sajal Ali-Movie Telugu Pakistan, Prabhas, Prabhashanu, Sajal Ali-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/pakistan-heroine-sajal-ali-for-star-hero-prabhas-detailsa.jpg)
సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లలో నటించిన అనుభవం ఆమెకు ఉండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మామ్ అనే సినిమాలో ఆమె నటించారు.పాకిస్తానీ ఆర్టిస్టులకు భారతీయ సినిమాలలో నటించే అవకాశం రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది పాక్ నటీమణులు ఇప్పటికే నటిస్తున్న సంగతి తెలిసిందే.మేకర్స్ నుంచి సజల్ అలీ ఈ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటన రావాల్సి ఉంది.
![Telugu Pakistan, Prabhas, Prabhashanu, Sajal Ali-Movie Telugu Pakistan, Prabhas, Prabhashanu, Sajal Ali-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/pakistan-heroine-sajal-ali-for-star-hero-prabhas-detailss.jpg)
సజల్ అలీ రెమ్యునరేషన్ కూడా ఒకింత భారీ స్థాయిలో ఉన్నట్టు సమాచారం అందుతోంది.సీతారామం తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.హను రాఘవపూడి ప్రభాస్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.ప్రభాస్ తర్వాత సినిమాలు సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.