మెగా ఫ్యామిలీ మధ్య అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్య గొడవలు వచ్చాయని వారి మధ్య మాటలు లేవని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.కేవలం వార్తలు మాత్రమే కాకుండా వారి ప్రవర్తన చూస్తే ఆ వార్తలు నిజమే అని నమ్మకం కలగక మానదు.
దాంతో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు( Mega vs Allu ) అంటూ హాట్ టాపిక్ నడుస్తోంది.అయితే తాజాగా కూడా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్నట్టుగానే ఉంది.
![Telugu Allu Arjun, Allu Sneha, Allu Fans, Chiranjeevi, Pawan Kalyan, Ram Charan, Telugu Allu Arjun, Allu Sneha, Allu Fans, Chiranjeevi, Pawan Kalyan, Ram Charan,](https://telugustop.com/wp-content/uploads/2024/07/allu-sneha-reddy-did-not-wished-upasana-konidela-on-her-birthday-detailss.jpg)
ఇరువురు అభిమానుల ట్విట్టర్లో మీమ్స్, ట్రోల్స్ తో హద్దులు దాటేస్తున్నారు.ఒకరి మీద ఒకరు రెచ్చిపోయి మరి కామెంట్స్ చేసుకుంటున్నా.అల్లు వర్సెస్ మెగా వార్‌ను కాస్త నిజమే అని చెప్పేలా కొన్ని రోజుల నుంచి స్నేహా రెడ్డి,( Sneha Reddy ) బన్నీ పోస్టులను చూస్తే అర్థం అవుతోంది.పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత కూడా స్నేహా రెడ్డి ఒక్క పోస్ట్ వేయలేదు.
ఇప్పుడు ఉపాసన బర్త్ డే( Upasana Birthday ) సందర్భంగా కూడా ఆమె స్పందించలేదు.ప్రస్తుతం బన్నీ ఫ్యామిలీ యూరోప్ ట్రిప్‌లో ఉంది.దీనికి సంబంధించిన ఫోటోలను స్నేహా రెడ్డి షేర్ చేస్తూనే ఉన్నారు.కానీ ఉపాసనకు మాత్రం బర్త్ డే విషెస్ చెప్పినట్టుగా పోస్ట్ ఎక్కడా కనిపించడం లేదు.
![Telugu Allu Arjun, Allu Sneha, Allu Fans, Chiranjeevi, Pawan Kalyan, Ram Charan, Telugu Allu Arjun, Allu Sneha, Allu Fans, Chiranjeevi, Pawan Kalyan, Ram Charan,](https://telugustop.com/wp-content/uploads/2024/07/allu-sneha-reddy-did-not-wished-upasana-konidela-on-her-birthday-detailsa.jpg)
ఉపాసన తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారందరికీ థాంక్స్ చెబుతూ ఆ పోస్టులను ఇన్ స్టా స్టోరీలో పెడుతూ రిప్లై ఇచ్చారు.లావణ్య త్రిపాఠి, ప్రణతి నందమూరి, నమ్రత శిరోద్కర్ లు ఉపాసనకు బర్త్ డే విషెస్ తెలిపారు.వారందరికీ తిరిగి ఉపాసన థాంక్స్ చెబుతూ ఇన్ స్టా స్టోరీలో పోస్టులు పెట్టారు.కానీ ఉపాసన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్( Allu Arjun ) భార్య స్నేహారెడ్డి విషెస్ తెలుపకపోవడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.
మెగా ఫ్యామిలీ, అల్లు వారి మధ్య ఏదో జరుగుతోందని, అందుకే ఇలా విషెస్ కూడా చెప్పుకోవడం లేదని తెలుస్తోంది.మరి ఈ రెండు ఫ్యామిలీల గురించి సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు ఆగడం లేదు.
మరి ఈ పోస్టులపై మెగా ఫ్యామిలీ అటు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి