White Hair : ఈ ఇంటి చిట్కాను ఉపయోగించి తక్కువ సమయంలోనే తెల్ల జుట్టును నల్లగా చేసుకోండి..!

ప్రస్తుత రోజులలో తెల్ల జుట్టు సమస్య అనేది సాధారణంగా మారిపోయింది.వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో ప్రస్తుత సమాజంలోని యువత కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే అనేక రకాల వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు.

 Home Remedies For White Hair To Black Hair-TeluguStop.com

ఇలా చేయడం వల్ల ఇంకా లేనిపోని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే ఇలా వాడడం వల్ల జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఒక బౌల్లో మెత్తగా పొడి చేసుకున్న టీ పొడి, ఒక స్పూన్ కాఫీ పొడి, 50 ml కొబ్బరి నూనె, అరచెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలపాలి.ఆ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి.నూనె వేడి అయ్యాక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి.

ఈ నూనె రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది.ఎప్పటికప్పుడు కూడా తయారు చేసుకుని తలకు పట్టించి పదినిమిషాల పాటు మసాజ్ చేసి రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపుతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడమే కాకుండా,జుట్టు రాలే సమస్యలు కూడా దూరమైపోతాయి.అయితే ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి.తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది.తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పని చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube