తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇటీవల కాలంలో ఈమె వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది.భాషతో సంబంధం లేకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఎక్కువ ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తీసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్.
అయితే మొదట చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగిన ఆమె లేడీ ఓరియంటెండ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు.

చిన్న వయసులోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించిన ఆమె ఆ పాత్రకు జీవం పోశారు.ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్ కేరీర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది.అయితే సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా హీరోయిన్లను గ్లామర్‌గా( Heroines Glamor ) చూపించడానికే దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు.ఇక చాలామంది హీరోయిన్లు గ్లామర్ నే నమ్ముకుంటారన్నది వాస్తవం.ఈ విషయం అందరికీ తెలిసిందే.హీరోయిన్లు ఏదో ఒక సందర్భంలో సినిమాలలో అందాలను ఆరబోయడం అన్నది కామన్.
చాలామంది హీరోయిన్లు అందాల ఆరబోతకు సై అంటుంటారు.

కానీ అందాల ఆరబోతకు పూర్తి భిన్నంగా ఉండే అతి కొద్ది మంది హీరోయిన్ లలో నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు.కోలీవుడ్‌లో ఐశ్వర్య రాజేశ్‌కు ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది.ఉమెన్స్ సెంట్రిక్ కథా పాత్రల్లో( Women Centric Movies ) నటిస్తూ వరుసగా చిత్రాలు చేసిన ఈమె ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో నటించడంతో తమిళంలో చిత్రాలు తగ్గాయి.
కాగా ఇటీవల విదేశాలకు వెళ్లిన ఐశ్వర్య రాజేశ్ అక్కడ నుంచి గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు.దీంతో ఐశ్వర్య రాజేశ్ కూడా గ్లామర్‌కు మారిపోయారనే ప్రచారం హల్చల్ చేస్తోంది.
కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ గ్లామర్ పాత్రల్లో నటించమని తనకు చాలా అవకాశాలు వచ్చాయని అన్నారు.కానీ ఈ విషయంపై ఆమె స్పందిస్తూ నేను అలాంటి పాత్రల్లో నటించడానికి అంగీకరించలేదు.
నాకు తగిన పాత్రల్లో నటించడమే నాకు ఇష్టం అని ఆమె చెప్పుకొచ్చింది.గ్లామరస్‌గా నటించడం నాకు నచ్చదు.
అందుకే గ్లామరస్ పాత్రల్లో నటించడానికి మొగ్గు చూపడం లేదు అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్.







