1.గుడివాడలో టిడిపి వినూత్న కార్యక్రమం
గుడివాడలో సైకో పోవాలి.సైకిల్ రావాలి అంటూ టిడిపి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
2.జగన్ ను కలిసిన సోమేష్ కుమార్

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో రిలీవ్ అనంతరం ఏపీకి వెళ్లిన తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు.
3.జేఎన్టీయూలో విద్యార్థులు ఆందోళన
కూకట్పల్లి జేఎన్టీయూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు.రిజిస్టర్ కార్యాలయం ముందు కూర్చుని ధర్నా చేపట్టారు.
4.ఎస్సీ వర్గీకరణ పై మందకృష్ణ మాదిగ కామెంట్స్

ఎస్సీల వర్గీకరణ పై బిజెపితో తాడోపేడో తేల్చుకుంటామని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
5.విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు
విజయవాడ డివిజన్ లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఈనెల 12న పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
6.కెసిఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లారు అక్కడ కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ డిఆర్ఎస్ భవనాలని ఆయన ప్రారంభించారు.
7.కాంగ్రెస్ నేతల అరెస్టుపై రేవంత్ రెడ్డి కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన సందర్భంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం అన్యాయం అని, ఇదే నియంత్రత్వ పాలనకు పరాకాష్ట అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
8.కేజ్రీవాల్ కు రికవరీ నోటీసులు

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ డైరెక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం నోటీసులు జారీ చేసింది.ప్రభుత్వ ప్రకటనలో ముసుగులో ఆమ్ ఆద్మీ పార్టీ జారీ చేసిన వాణిజ్య ప్రకటనలకు గాను 168.62 కోట్ల రికవరీ నోటీసులను ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం జారీ చేసింది.
9.కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్
తనకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని పిసిసి కమిటీలను తాను పట్టించుకోనని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
10.ఉద్యమకారులను ఏకం చేస్తాం : కోదండరాం

తెలంగాణ బచావో పేరిట ఉద్యమకారులందర్నీ ఏకం చేస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు.
11.టీటీడీ వసతి గదుల అద్దె పెంపుపై వీర్రాజు కామెంట్స్
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుత వసతి గదుల అద్దెలను పెంచడం ను నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు హాజరయ్యారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం టిటిడి అవలంబిస్తున్న వైఖరి మానుకోవాలని వీర్రాజు డిమాండ్ చేశారు.
12.బండి సంజయ్ పర్యటన

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేడు కొల్లాపూర్ లో పర్యటించనున్నారు.
13.శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు
ఈనెల 28న శ్రీవారి యాగంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి .ఒకేరోజు సప్త వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.
14.నేడు మంత్రాలయంలో విశేష పూజలు

నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి మూల బృందావనం తులసి అర్చన కానుక అభిషేకం పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
15.సర్వదర్శనం భక్తులకు టోకెన్లు
ఈరోజు నుంచి సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ
16.జి20 సదస్సుల సన్మాహక సమావేశం విశాఖలో

విశాఖ కేంద్రంగా జరగనున్న జి20 సదస్సుల సన్నాహక సమావేశాన్ని ఏపీ సీఎం జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.
17.గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయండి
గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి తెలంగాణ హైకోర్టు అనుమతించింది.
18.హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం

ఐటీ అధికారులు హైదరాబాద్ లో మూడు చోట్ల విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు .బాలానగర్ లోని రెండు కెమికల్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు.మొత్తం ఆరు బృందాలతో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు.
19.కేంద్రంపై కేసీఆర్ మండిపోటు
కేంద్ర ప్రభుత్వ అసమర్థత వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు.
20.జీవో నెంబర్ 1పై హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ ఒకటిపై హైకోర్టులో పిటిషన్ దాకలైంది .ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సిపిఐ రామకృష్ణ కోర్టును కోరారు.అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా తీసుకోనక్కర్లేదని ఏజి తెలిపారు.ప్రస్తుతం ఉన్న బెంచ్ కు ఈ ఫిల్ ను విచారించే అధికారం లేదని ఏజి స్పష్టం చేశారు.