వైరల్ వీడియో: వీధులలో నివసిస్తున్న మహిళకి ఊహించలేని గిఫ్ట్ ఇచ్చిన యూట్యూబర్..

ప్రస్తుత రోజులలో మనం కష్టాలలో ఉన్నామంటే దగ్గరికి రాకుండా ఉండే మనుషులను చూస్తూ ఉన్నాం.ఒకవేళ వారి దగ్గర డబ్బు లేకపోతే అసలు వారి ముఖం కూడా చూడరు కొంతమంది.

 Influencer Surprises Homeless Woman With Her Own Apartment Video Viral Details,-TeluguStop.com

అయితే తాజాగా ఒక అమెరికన్ మహిళకు( US Woman ) ఇచ్చిన సర్ప్రైజ్ చూసి ఆ మహిళ చాలా ఆనందపడింది.తాజాగా అమెరికన్ సోషల్ ఇన్ఫ్లెన్సర్ ఒకరు వీధులలో నివసించే ఒక మహిళకు ఇచ్చిన సర్ప్రైజ్ అందరిని చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.స్వీటీ( Sweety ) అనే మహిళ అమెరికన్ వీధులలో నివసిస్తూ గత పది సంవత్సరాలుగా ఆమె జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంది.అయితే తాజాగా ప్రముఖ ఇన్ఫ్లెన్సర్ ఇసాయా( Isaiah ) ఆ మహిళకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.ఆ సర్ప్రైజ్ ఏమిటి అంటే.ముందుగా అతడు ఆమె నివసించే చోటుకు వెళ్లి ఆ మహిళను పిలవగా ఆమె చాలా ఆనందంగా బయటికి వచ్చింది.ఇక ఆ మహిళను చూసిన ఇసాయా నీకు ఒక సర్ప్రైజ్ ( Surprise ) ఇస్తానని తెలియచేశాడు.

ఈ క్రమంలో ఆ మహిళ చేతిలో ఒక పేపర్ బ్యాగును పెట్టి అందులో తాళాలను చూసి మొదట ఆమెకు ఏమీ అర్థం అవ్వలేదు.

అనంతరం ఏమి అర్థం కాని.స్థితిలో ఉన్న ఆమెకు నీకు ఒక అపార్ట్మెంట్ను( Apartment ) ఫ్రీగా ఇచ్చానని తెలియజేశాడు.కానీ అప్పటికి ఆ మహిళకు మాత్రం నమ్మకం కుదరలేదు.

ఈ తరుణంలో ఇసాయా ఆమె కళ్ళకు గంతలు కట్టి ఒక ప్లాట్ వద్దకు తీసుకొని లోపలకు వెళ్లిన అనంతరం ఆమె కళ్ళకు ఉన్న గంతలు విప్పాడు.దీంతో ఒక్కసారిగా ఆ మహిళ ఆశ్చర్యానికి లోనైపోయింది.

గత కొన్ని సంవత్సరాలుగా వీధులలో నివసిస్తున్న ఆమెకు తనకంటూ ఒక చోటు లభించిందని కన్నీటి పర్యంతమైంది.ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం ఇసాయా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ ఇసాయా నిజంగా గొప్ప పని చేశాడు అంటూ కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube