టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న హరీష్ శంకర్ ( Harish Shankar )త్వరలోనే మిస్టర్ బచ్చన్( Mister Bachchan) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈయన చివరిగా గద్దల కొండ గణేష్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా విడుదలయి దాదాపు ఐదు సంవత్సరాలు అయినా ఇప్పటివరకు తదుపరి సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఇక త్వరలోనే రవితేజ ( Raviteja ) హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతోంది.కాగా హరీష్ శంకర్ తెరకెక్కించిన 7 సినిమాల్లో రెండు రీమేక్స్ ఉన్నాయి.గబ్బర్ సింగ్ హిందీ దబంగ్ రీమేక్ కాగా, తమిళ క్లాసిక్ జిగర్తాండ రీమేక్ గా గద్దలకొండ గణేష్ తెరకెక్కింది.ఇక పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సినిమా కూడా రీమేక్ అనే వాదన ఉంది.
దీంతో ఒక నేటిజన్ ఈయన సినిమాల గురించి కామెంట్ చేస్తూ.సర్, మీరు రీమేక్స్ ( Remakes ) చేయడం ఆపేయండి.మీరు సొంతగా రాసుకున్న కథలతో అద్భుతం చేయగలరు.భారీ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వండి.
మిస్టర్ బచ్చన్ కి గుడ్ లక్, అంటూ హరీష్ కి సలహా ఇచ్చాడు.
ఈ విధంగా తన సినిమా గురించి నేటిజన్ ఇలాంటి కామెంట్ చేయటంతో హరీష్ శంకర్ స్పందిస్తూ.మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన తర్వాత అది రీమేక్ అని నువ్వు ఫీల్ అయితే అప్పుడు మాట్లాడుకుందాం బ్రో.నేను సోషల్ మీడియా ఫ్రెండ్లి డైరెక్టర్ ని.మీరు ఎప్పుడైనా నాకు మెసేజ్ పెట్టవచ్చు.అని హరీష్ శంకర్ సదరు నెటిజన్ కి సమాధానం ఇచ్చాడు.
ఇలా ఈయన ఇచ్చిన సమాధానం చూస్తుంటే మిస్టర్ బచ్చన్ సినిమా రీమేక్ కాదని స్పష్టంగా అర్థమవుతుంది.ఇక దాదాపు 13 సంవత్సరాల తర్వాత రవితేజ హరీష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా వీరికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.