బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi kapoor ) గురించి మనందరికీ తెలిసిందే.దివంగత హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
టాలీవుడ్ బాలీవుడ్ అని భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ఇకపోతే త్వరలోనే ఈమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో( Devara ) తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.
ఇకపోతే జాన్వీ కపూర్ తాజాగా నటించిన చిత్రం ఉలఝ్.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ జాన్వీ కపూర్ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా తాజాగా ఆమె సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ పై( Trolls ) స్పందించారు.
ఈ సందర్భంగా జాన్వి కపూర్ మాట్లాడుతూ.సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే సోషల్ మీడియా కల్చర్ అది.నువ్వు పబ్లిక్ ఫిగర్ అయినా, కాకపోయినా ఇలాంటివి నిరంతరం జరుగుతూనే ఉంటాయి.కాబట్టి ఆ కామెంట్స్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.ఒక విషయంలో ఈరోజు పొగిడిన వాళ్లే, అదే విషయంపై రేపు తిడతారు.

ముక్కూ, మొఖం తెలియని వాళ్లు ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవడం ఎందుకు.మనకు మనమే ప్రాధాన్యం ఇచ్చుకోవాలి అని చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై నేటిజన్స్ స్పందిస్తూ సూపర్ గా చెప్పారు మేడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో వచ్చే విషయాలను పట్టించుకోకపోవడం బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఉలఝ్ సినిమా( Ulajh Movie ) విషయానికి వస్తే.జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా ఈ సినిమాను తెరకెక్కించారు.
జంగ్లీ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది.జాన్వీ ఇందులో ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిణిగా కనిపించనుంది.
ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో గుల్షన్ దేవయ్య, రాజేశ్ థైలాంగ్ ముఖ్య పాత్రల్లో నటించారు.