వైసీపీకి మరో కీలక నేత రాజీనామా .. జగన్ రియాక్షన్ ఏంటో ?

ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీకి ( YCP ) వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.  ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున పార్టీ కీలక నాయకులు వైసిపికి రాజీనామా చేసి టిడిపి, జనసేన, బిజెపి వంటి పార్టీలలో చేరిపోయారు .

 Maddali Giri Resigned From Ycp Details, Ysrcp, Ap, Ap Government, Chandrababu, C-TeluguStop.com

ఇంకా ఈ చేరికలు పరంపర కొనసాగుతూనే ఉంది.ఈ చేరికలకు అడ్డుకట్ట వేసేందుకు , పార్టీ నాయకుల్లో ధైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు.

గత కొద్ది రోజులుగా జనాల్లోనే ఉంటూ జగన్ హడావుడి చేస్తున్నారు.ఈనెల 24వ తేదీన ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి జగన్ గెలుపునిచ్చారు.  ఏపీలో చోటుచేసుకుంటున్న దాడులు, హత్య వ్యవహారాలపై జగన్ ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.

Telugu Ap, Chandrababu, Maddala Giri, Maddali Giri, Vidadala Rajini, Ycp Guntur,

ఇది ఇలా ఉండగానే తాజాగా మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు .గుంటూరు వైసిపి నగర అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి( Maddala Giri ) వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .ఈ మేరకు వైసిపి అధినేత జగన్ కు లేఖను పంపించారు.తాను వ్యక్తిగత కారణాలతోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మద్దాలగిరి లేఖలో స్పష్టం చేశారు.గుంటూరు నగర వైసిపి అధ్యక్షుడిగా( Guntur Town YCP President ) గత కొంతకాలంగా మద్దాలగిరి పనిచేస్తున్నారు.వ్యక్తిగత కారణాలతో గుంటూరు వైసిపి అధ్యక్ష పదవికి , పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మద్దలగిరి ఆ తర్వాత కొంతకాలానికి వైసీపీకి మద్దతుగా కొనసాగారు.

Telugu Ap, Chandrababu, Maddala Giri, Maddali Giri, Vidadala Rajini, Ycp Guntur,

2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసేందుకు మద్దాల గిరి సిద్ధమైనా,  ఆయన కు అవకాశం ఇవ్వకుండా మాజీ మంత్రి విడుదల రజనీకి ఆ సీటును కేటాయించారు.  దీంతో అప్పట్లోనే మద్దాలగిరి అసంతృప్తికి గురయ్యారు.ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేకపోవడం , రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం తదితర కారణాలతో ఆ పార్టీలో ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో మద్దాల గిరి వైసీపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.మద్దాల గిరి టిడిపిలో చేఋతారా లేక పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతారా అనేది తేలాల్సి ఉంది .ఇక మద్దాలగిరి రాజీనామా వ్యవహారంపై ఆ పార్టీ అధినేత జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube