వైసీపీకి మరో కీలక నేత రాజీనామా .. జగన్ రియాక్షన్ ఏంటో ?

ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీకి ( YCP ) వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.

  ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున పార్టీ కీలక నాయకులు వైసిపికి రాజీనామా చేసి టిడిపి, జనసేన, బిజెపి వంటి పార్టీలలో చేరిపోయారు .

ఇంకా ఈ చేరికలు పరంపర కొనసాగుతూనే ఉంది.ఈ చేరికలకు అడ్డుకట్ట వేసేందుకు , పార్టీ నాయకుల్లో ధైర్యం నింపేందుకు ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు.

గత కొద్ది రోజులుగా జనాల్లోనే ఉంటూ జగన్ హడావుడి చేస్తున్నారు.ఈనెల 24వ తేదీన ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి జగన్ గెలుపునిచ్చారు.

  ఏపీలో చోటుచేసుకుంటున్న దాడులు, హత్య వ్యవహారాలపై జగన్ ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.

"""/" / ఇది ఇలా ఉండగానే తాజాగా మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు .

గుంటూరు వైసిపి నగర అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి( Maddala Giri ) వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .

ఈ మేరకు వైసిపి అధినేత జగన్ కు లేఖను పంపించారు.తాను వ్యక్తిగత కారణాలతోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మద్దాలగిరి లేఖలో స్పష్టం చేశారు.

గుంటూరు నగర వైసిపి అధ్యక్షుడిగా( Guntur Town YCP President ) గత కొంతకాలంగా మద్దాలగిరి పనిచేస్తున్నారు.

వ్యక్తిగత కారణాలతో గుంటూరు వైసిపి అధ్యక్ష పదవికి , పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మద్దలగిరి ఆ తర్వాత కొంతకాలానికి వైసీపీకి మద్దతుగా కొనసాగారు.

"""/" / 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసేందుకు మద్దాల గిరి సిద్ధమైనా,  ఆయన కు అవకాశం ఇవ్వకుండా మాజీ మంత్రి విడుదల రజనీకి ఆ సీటును కేటాయించారు.

  దీంతో అప్పట్లోనే మద్దాలగిరి అసంతృప్తికి గురయ్యారు.ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేకపోవడం , రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం తదితర కారణాలతో ఆ పార్టీలో ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో మద్దాల గిరి వైసీపీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

మద్దాల గిరి టిడిపిలో చేఋతారా లేక పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతారా అనేది తేలాల్సి ఉంది .

ఇక మద్దాలగిరి రాజీనామా వ్యవహారంపై ఆ పార్టీ అధినేత జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

నా మాతృభూమి నాకు ముఖ్యమంటూ రూ.కోట్లు వదులుకున్న సుదీప్.. ఏం జరిగిందంటే?