కెనడాలో రెచ్చిపోయిన దుండగులు.. హిందూ ఆలయంపై చెత్త రాతలు, భారత్ ఆగ్రహం

కెనడాలో ( Canada )మరోసారి హిందూ వ్యతిరేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఎడ్మంటన్‌లోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిర్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఆలయ గోడలపై హిందూ వ్యతిరేక రాతలు రాశారు.

 Hindu Temple Vandalised With Anti-india Grafitti In Canada's Edmonton , Canada,-TeluguStop.com

ప్రధాని నరేంద్ర మోడీ,( Prime Minister Narendra Modi ) భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్యలను ఉద్దేశించి అవి ఉన్నాయి.దీనిపై ఎంపీ చంద్ర ఆర్య( MP Chandra Arya ) స్పందించారు.

కెనడాలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత, హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.గత కొన్నేళ్లుగా గ్రేటర్ టొరంటో ఏరియా, బ్రిటీష్ కొలంబియా, కెనడాలోని ఇతర ప్రదేశాలలో హిందూ దేవాలయాలు ద్వేషపూరిత గ్రాఫిటీతో ధ్వంసం చేయబడ్డాయని ఆర్య మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Telugu Canada, Hindu Temple, Hindutemple, Mp Chandra Arya, Primenarendra-Telugu

లిబరల్ పార్టీకి ( Liberal Party )చెందిన చంద్ర ఆర్య.కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదంపై పలుమార్లు మండిపడ్డారు.వారు (ఖలిస్తాన్‌వాదులు) వాక్చాతుర్యం, ద్వేషం, హింసతో తేలికగా తప్పించుకుంటున్నారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని .తాజా సంఘటనను తన రికార్డులలో ఉంచుతానని చంద్ర చెప్పారు.కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలని ఆయన పునరుద్ఘాటించారు .సిఖ్స్ ఫర్ జస్టిస్‌కు చెందిన గురుపత్వంత్ సింగ్ పన్నూన్( Gurupatwant Singh Pannoon ).హిందువులు తిరిగి భారతదేశానికి వెళ్లిపోవాలని బహిరంగంగా పిలుపునిచ్చారని చంద్ర ఆర్య చెప్పారు.ఖలిస్తాన్ మద్దతుదారులు బ్రాంప్టన్ , వాంకోవర్‌లలో ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగిన తీరును ప్రదర్శిస్తూ బహిరంగంగా సంబరాలు చేసుకున్నారని చంద్ర ఆర్య గుర్తుచేశారు.

Telugu Canada, Hindu Temple, Hindutemple, Mp Chandra Arya, Primenarendra-Telugu

కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడు రాండీ బోయిస్సోనాల్డ్ ( Randy Boissonald )సైతం ఆలయాన్ని ధ్వంసం చేయడంపై స్పందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.ఆశ్రయ స్థలంగా ఉండాల్సిన గోడలపై ద్వేషపూరి వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారని దుయ్యబట్టారు.కెనడాలో ద్వేషానికి చోటు లేదని, మా నగరంలోని విలువలకు విరుద్ధంగా ఈ ఘటన ఉందని రాండీ ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు.ఆలయ ధ్వంసంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ ఘటనపై విచారణ జరిపి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కెనడా యంత్రాంగాన్ని కోరింది.

ఈ మేరకు వాంకోవర్‌‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube