వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలనే కోరిక అందరికీ ఉంటుంది.కానీ, ప్రస్తుత రోజుల్లో అది చాలా మందికి అసాధ్యంగా మారుతోంది.
ముప్పై, నాలుబై ఏళ్లు వచ్చాయంటే చాలు ముడతలు, చర్మం సాగటం, పొడిగా మారటం వంటి వృద్ధాప్య లక్షణాలన్నీ ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.దాంతో వాటిని కవర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.
ఖరీదైన క్రీమ్స్, సీరమ్స్ వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయిగే డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని ట్రై చేస్తే నలబైలోనూ యవ్వనంగా మెరిసిపోతారు.
మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదారు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి వాటర్‌తో ఒకసారి వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత అందులో ఒక కప్పు వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి.ఉదయాన్నే నానబెట్టుకున్న బియ్యాన్ని బ్లెండర్‌లో వేసుకోవాలి.
అలాగే అందులో అర కప్పు మజ్జిగ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.స్ల్రైనర్ సాయంతో జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ సి పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని.
ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.కంప్లీట్‌గా డ్రై అయిన అనంతరం కూల్ వాటర్‌తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని.
స్కిన్‌కు సూట్ అయ్యే మంచి మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే.ముడతలు, చర్మం సాగడం, పొడి చర్మం వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం మవ్వనంగా మెరుస్తుంది.
స్కిన్ టోన్ రెట్టింపు అవుతుంది.మరియు చర్మంపై ఏమైనా మచ్చలు ఉన్నా.
అవి క్రమంగా దూరం అవుతాయి.కాబట్టి, తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.