అమానుషం.. బైక్ కు కుక్కను కట్టేసి ఏకంగా నడిరోడ్డుపై..?

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.అందులో ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు వైరల్ అవ్వడం ఎక్కువగా చూస్తూనే ఉంటాము.

 Viral Video Dog Tied To Scooter Dragged For Miles In Karnataka Udupi Details, Ka-TeluguStop.com

అప్పుడప్పుడు కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి.ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి కుక్కపై( Dog ) ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

మానవత్వం( Humanity ) మంట కలిసింది అనే సామెతకు సరిపోయేలా ఓ వ్యక్తి ఆ మూగ జీవి పై కాస్త కర్కశంగా ప్రవర్తించాడు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

కర్ణాటక రాష్ట్రంలోని( Karnataka ) ఉడిపి జిల్లాలో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి కుక్కను కట్టి రోడ్డుమీద దానిని లాక్కెళ్ళిన దృశ్యాలుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.వీడియో కాస్త వైరల్ కావడంతో అతడి పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారునెటిజన్స్.ఉడిపి జిల్లా( Udipi ) కాపు తాలూకా సిర్వ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఓ వ్యక్తి ఓ కుక్కను తన స్కూటర్కు( Scooter ) కట్టుకొని ఏకంగా ఆరు కిలోమీటర్ల వరకు లాక్కుని వెళ్ళాడు.

ఇకపోతే ఈ విషయంపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగి ఘటనకు సంబంధించిన వ్యక్తిని అబ్దుల్ ఖాదర్ గా గుర్తించారు.అయితే ఈ సంఘటనలో కుక్కను అలా ఎందుకు చేశారని విషయంపై ఆరా తీసిన పోలీసులు.కుక్కను చంపేందుకు అలా రాకేల్లారని అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి కుక్కపై ఘోరంగా వ్యవహరించాడని.అంతేకాకుండా నడిరోడ్డుపై హెల్మెట్ లేకుండా వాహనం నడపడానికి కేసు నమోదు చేశారు.

ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అతనిపై చాలా ఘాటుగా స్పందిస్తున్నారు.

ఆ కుక్క స్థానంలో అతనిని తగిలించి బండిపై ఊరేగిస్తే ఎలా ఉంటుందో చూడాలంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube