1976లో వచ్చిన “బంగారు మనిషి” సినిమా పెద్ద హిట్ అయింది.A.
భీంసింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీ రామారావు, లక్ష్మి, హేమ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు.K.V.మహదేవన్ మ్యూజిక్ ఆఫర్ చేశారు.ఈ మూవీ షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.అదేంటంటే ఈ మూవీ హీరోయిన్ అయిన లక్ష్మీ చేత ఎన్టీఆర్ రెండు దోశలు బలవంతంగా తినిపించారు.
అలా ఎందుకు చేశారో తెలుసుకుందాం.బంగారు మనిషి( Bangaru Manishi ) చిత్రీకరణ సమయంలో ఒకరోజు సాయంత్రం ఎన్టీఆర్( N T RAMARAO) ఇంటి నుంచి ఒక ఫుడ్ క్యారియర్ వచ్చింది.
అందులో దోశలు, హల్వా, కారప్పూస, రెండు యాపిల్ జ్యూస్ బాటిల్స్‌తో పాటు మిగతా ఆహార పదార్థాలు ఉన్నాయి.అయితే వాటిని ఎన్టీఆర్ ఒక్కరే తినలేదు.
హీరోయిన్ లక్ష్మిని కూడా పిలిచి టిఫిన్ చేయాల్సిందిగా కోరారు.తన కోసం పంపించిన ఆ క్యారియర్ లోని ఫుడ్ ను లక్ష్మీతో పంచుకోవాలనుకున్నారు.
ఈ క్యూట్ గెస్చర్ తో లక్ష్మి( Lakshmi) ఫిదా అయిపోయారు.తర్వాత టిఫిన్ చేయడానికి కూర్చున్నారు.
అయితే ఆమె కేవలం సగం దోసె మాత్రమే తినగలిగారు.ఆపై లేచి వెళ్ళిపోతుంటే ఎన్టీఆర్ ఆమెను వెనక్కి పిలిచారు.
“ఎంతైనా తిని అరిగించుకో గల వయసు మీది.కేవలం సగం దోసె తిని వెళ్లడానికి మీకు సిగ్గు లేదా.రండి కూర్చోండి.” అని ఆమెని మళ్లీ వెనక్కి పిలిపించారు.ఆపై బలవంతంగా రెండు దోసెలు తినిపించారు.ఈ సంగతి తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు.ఎన్టీఆర్ తన చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఆహారం షేర్ చేసుకుంటారు, తినకపోతే మందలిస్తారు.లక్ష్మీని కూడా అలాగే మందలించి ఉంటారు.
ఎంతైనా ఎన్టీఆర్ చాలా మంచి మనసున్న వ్యక్తి.
ఈ ఘటన గురించి తెలిశాక అలనాటి ఆప్యాయతలు అలానే ఉండేవి అని సినిమా ప్రేక్షకులు మాట్లాడుకున్నారట.ఇకపోతే ఎన్టీఆర్ బాగా ఫుడ్ తింటారు.నేతి దోశలు అంటే ఆయనకు చాలా ఇష్టం.
ఇంకా ఇడ్లీలు కూడా బాగానే లాగిస్తారు.బాగా తింటేనే బలంగా ఉండగలం, బాగా పని చేయగలం అని ఎన్టీఆర్ నమ్మేవారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా కడుపునిండా ఫుడ్ తినేస్తుంటారు.తాతయ్య పోలికలే మనవడికి రావడం విశేషం.
లక్ష్మీ పూర్తి పేరు యరగుడిపడి వెంకట మహాలక్ష్మి.ఆమె మొత్తం ముగ్గురిని పెళ్లి చేసుకున్నారు.లక్ష్మీ చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు.“ఓ! బేబీ” సినిమాలో సావిత్రి/బేబక్క/బేబీగా అద్భుతంగా నటించి మెప్పించారు.2023లో ఖుషి సినిమాలో సమంత నాన్నమ్మగా నటించారు.