కోడిగుడ్లు అధికంగా తింటున్నారా..? అయితే మీరు ఈ సమస్యల బారిన పడినట్టే..!

శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యులు రోజుకో గుడ్డు( Eggs ) కచ్చితంగా తినాలని సూచిస్తూ ఉంటారు.కానీ చాలామంది రోజుకో గుడ్డు తినరు.

 Side Effects Of Eating Too Much Eggs,eggs,health Benefits,health Tips,bad Choles-TeluguStop.com

అయితే రోజుకి ఒక గుడ్డు కాకుండా కొన్నిసార్లు రోజులో నాలుగైదు గుడ్లు తినేస్తూ ఉంటారు.ఇలా చేయడం అసలు శరీరానికి మంచిది కాదు.

ఇలా చేయడం వలన శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.అయితే రోజుకు ఎన్ని గుడ్లు తినాలి అనే దానిపై ఇప్పటికే చాలా అధ్యయనాలు కూడా తేల్చి చెప్పాయి.

ఒకే రోజులో ఎక్కువ గుడ్లు తినడం వలన ఆరోగ్యం పై చాలా ప్రభావం పడుతుంది.అందుకే రోజుకో గుడ్డు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్( Cholestrol ) పేర్కొ పోదు.

కానీ ఎక్కువగా గుడ్లు తింటే మాత్రం చెడు కొలెస్ట్రాల్ శరీరం మొత్తం పేరుకుపోయే అవకాశం ఉంది.

Telugu Bad Cholestrol, Eggs, Benefits, Tips, Effects Eggs, Vitamin-Telugu Health

గుడ్డులోని పచ్చ సోనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది.నిజానికి ఇది మంచి కొలెస్ట్రాల్ కానీ అధికంగా తినడం వలన మాత్రం ఈ కొలెస్ట్రాల్ మొత్తం చెడు కొలెస్ట్రాల్ గా మారి శరీరం మొత్తం పేరుకుపోతుంది.అందుకే రోజులో ఎన్ని గుడ్లు తినాలన్న విషయంలో చాలా అధ్యయనాలు కూడా జరిగాయి.

పరిశోధనల ప్రకారం అయితే ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు రెండు గుడ్లు తినవచ్చు.అలాగే వారానికి ఏడు నుండి పది గుడ్ల వరకు తినాలి.

అంతకు మించి తీసుకోకపోవడమే చాలా మంచిది.అయితే రోజు జిమ్( Gym Workouts ) వెళ్లేవారు, వర్కౌట్ లు చేసే వాళ్ళు మాత్రం ప్రోటీన్ కోసం ఎక్కువగా గుడ్లను తీసుకోవచ్చు.

Telugu Bad Cholestrol, Eggs, Benefits, Tips, Effects Eggs, Vitamin-Telugu Health

అయితే పచ్చ సోన( Yellow ) మాత్రం తక్కువగా తీసుకుంటే మంచిది కాదు.రోజు రెండుకు మించి గుడ్లు తినేవారు.పచ్చ సోన తీసుకోకపోవడం మంచిది.కోడిగుడ్లు రోజుకు ఒకటి తినడం వలన శరీరానికి చాలా పోషకాలు అందుతాయి.గుడ్డులో మన శరీరానికి అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉన్నాయి.ఇవి ఏ ఆహారంలోనూ కూడా ఉండవు.

దీనిలో ఉండే ప్రోటీన్( Protein ) మన శరీరానికి చాలా అవసరం.అలాగే ఇందులో ఉండే విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ డి( Vitamin D ) చాలా అధికంగా ఉంటాయి.

ఇవన్నీ మన శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube