ఐఫా అవార్డులలో సత్తా చాటిన బాలయ్య భగవంత్ కేసరి... ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) తాజాగా అనిల్ రావిపూడి( Anil Ravipudi )డైరెక్షన్లో నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Bhagavanth Kesari Nominate Four Categories On Iifa Awards , Iifa Awards, Balakri-TeluguStop.com

తండ్రి కూతుర్ల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాలో శ్రీ లీల ( Sreeleela ) బాలకృష్ణ ( Balakrishna ) కు కూతురి పాత్రలో నటించగా కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడిగా నటించారు.

Telugu Anil Ravipudi, Iifa Awards, Nbk, Sreeleela, Tollywood-Movie

ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసిన ఈ సినిమా ఇటు థియేటర్లలోను అటు బుల్లితెరపై కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇకపోతే తాజాగా ఐఫా అవార్డులలో కూడా ఈ సినిమా ఏకంగా నాలుగు విభాగాలలో నామినేషన్స్ లో నిలవడం విశేషం.సినీ ఇండస్ట్రీలో నటించే సెలబ్రిటీలను గౌరవిస్తూ ప్రతి ఏడాది వారికి ఎన్నో రకాల అవార్డులను అందజేస్తూ ఉంటారు.ఇలాంటి అవార్డులలో ఐఫా అవార్డులు ( IIFA Awards ) కూడా ఒకటి.

ఇక ఈ ఏడాది ప్రకటించబోయే ఐఫా అవార్డులలో భాగంగా భగవంత్ కేసరి సినిమా ఏకంగా నాలుగు విభాగాలలో నిలిచింది.

Telugu Anil Ravipudi, Iifa Awards, Nbk, Sreeleela, Tollywood-Movie

ఈ అవార్డు వేడుకలలో భాగంగా బెస్ట్ సినిమాగా అలాగే బెస్ట్ ఫిమేల్ రోల్, బెస్ట్ మేల్ రోల్, అలాగే డైరెక్టర్గా 4 క్యాటగిరీలలో ఈ సినిమా నామినేషన్ లో నిలవడంతో చిత్ర బృందం అలాగే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి త్వరలోనే జరగబోయే ఈ వేడుకలలో భాగంగా భగవంత్ కేసరి సినిమా ఎన్ని అవార్డులను అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబి డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా ఈ ఏడాది చివరిన లేదా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube