స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా ఒక అద్భుతం అనే సంగతి తెలిసిందే.రాజమౌళి బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకుని స్పూర్తిగా నిలిచారు.
జక్కన్న జీవిత విశేషాలతో డాక్యుమెంటరీ తీయగా రాజమౌళి గురించి తారక్( Tarak ) చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఆగష్టు 2వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో “మోడ్రన్ మాస్టర్స్”( Modern Masters ) పేరుతో స్ట్రీమింగ్ కానుంది.
ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మాట్లాడుతూ రాజమౌళికి సానుభూతి లేదని జక్కన్న ఒక పిచ్చోడని అతనితో వాదించి ప్రయోజనం ఉండదని చెప్పుకొచ్చారు.రాజమౌళి ఏం కావాలో ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోవడమే అని ఎన్టీఆర్ తెలిపారు.
ఇప్పటివరకు ఎవరూ చూపని కథలను ప్రపంచానికి చెప్పడం కోసం రాజమౌళి జన్మించారని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
![Telugu Rajamouli, James Cameron, Ntr, Modern Masters, Netflix, Prabhas, Ram Char Telugu Rajamouli, James Cameron, Ntr, Modern Masters, Netflix, Prabhas, Ram Char](https://telugustop.com/wp-content/uploads/2024/07/junior-ntr-comments-about-rajamouli-detailss.jpg)
ప్రభాస్( Prabhas ) మాట్లాడుతూ రాజమౌళి లాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదని సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ అని వెల్లడించారు.జేమ్స్ కేమరూన్( James Cameron ) మాట్లాడుతూ రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదని పేర్కొన్నారు.రాజమౌళి అంటే ఎంతో గౌరవం అని ఆయన ఎవరితోనైనా పని చేయగలరని చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్( Ram Charan ) మాట్లాడుతూ జక్కన్న సినిమాలలో నన్ను నేను చూసి ఎంతో ఆశ్చర్యపోతానని ఆయన అన్నారు.
![Telugu Rajamouli, James Cameron, Ntr, Modern Masters, Netflix, Prabhas, Ram Char Telugu Rajamouli, James Cameron, Ntr, Modern Masters, Netflix, Prabhas, Ram Char](https://telugustop.com/wp-content/uploads/2024/07/junior-ntr-comments-about-rajamouli-detailsa.jpg)
రమా రాజమౌళి మాట్లాడుతూ రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయనను పని రాక్షసుడని పిలుస్తుంటారని వెల్లడించారు.నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.రాజమౌళి డాక్యుమెంటరీపై సినీ అభిమానులు సైతం ఒకింత ఎక్కువగానే ఆసక్తి చూపించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.