ఏపీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసిపి అధినేత జగన్( YS Jagan ) స్పీడ్ పెంచారు.టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నాయకులే టార్గెట్ గా దాడులు, హత్యలు జరుగుతుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పడం వంటి వాటిని సీరియస్ గా తీసుకున్నారు.
పార్టీ ఓటమి తరువాత పూర్తిగా అజ్ఞాతంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న వైసిపి నాయకుల్లోనూ( YCP Leaders ) కదలిక తెచ్చేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే పరామర్శలు పేరుతో జనాల్లోకి జగన్ వస్తున్నారు.
ఇక వైసిపి నే టార్గెట్ చేసుకుని అధికారి టిడిపి కూటమి చేస్తున్న దాడులను నిరోధించేందుకు, ఈ విషయంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి కలుగు చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఈనెల 24వ తేదీన ఢిల్లీలో( Delhi ) నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వైసీపీ కీలక నాయకులంతా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.ఏపీలో టిడిపి కూటమి( TDP Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని ఇప్పటికే జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు కూడా ఏపీలో అదుపుతప్పాయని, వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటనకు సంబంధించి, అలాగే పుంగనూరులో ఎంపీ మిధున్ రెడ్డి పైన ( MP Mithun Reddy ) జరిగిన రాళ్లదాడి వ్యవహారం పైన గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు.వీటిని నిరసిస్తూనే ఢిల్లీ వేదికగా పోరాటం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
దేశ రాజధానిలో జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలంటూ విపక్ష పార్టీలకు జగన్ ఆహ్వానాలు పంపుతూ, అందరిని ఏకం చేసి తమ పోరాట కార్యక్రమానికి మద్దతు ఉండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. 24వ తేదీన ఢిల్లీలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పార్టీలను ఆహ్వానించి నిరసన తెలపడం ద్వారా ఏపీలో దాడులకు బ్రేక్ పడేలా చేయవచ్చని జగన్ భావిస్తున్నారు .ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్లు కూడా జగన్ కోరారు.వారి అపాయింట్మెంట్ దక్కితే ఏపీలో పరిస్థితులను వారికి వివరించి , తమ ధర్నా కార్యక్రమం పై వారికి సమాచారం ఇవ్వాలనే ప్లాన్ లో జగన్ ఉన్నారు.
ఏది ఏమైనా ఈనెల 24న ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నా కార్యక్రమం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.