తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు(Mahesh Babu)… అయితే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమా చేయకపోయిన కూడా పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.ఇక రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
ఇక ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు కానీ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమాతో అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరు కూడా భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు.తద్వారా పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా స్థాయిని పెంచాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ రాజమౌళితో మహేష్ బాబు (Rajamouli, mahesh babu)చేస్తున్న సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.కానీ ఆ తర్వాత మహేష్ బాబు తో సినిమా చేసే దర్శకులు మాత్రం ఆచితూచి ముందుకు అడుగులు వేయాల్సిన అవసరమైతే ఉంది.
ఎందుకంటే ఈ సినిమా పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ సాధిస్తే ఆ తర్వాత చేయబోయే సినిమా కూడా వరల్డ్ లెవెల్ స్టోరీ తోనే ఉండాలి.
లేకపోతే మాత్రం మహేష్ బాబు అభిమానులు తీవ్రంగా నిరాశ పడే అవకాశాలైతే ఉన్నాయి.అందుకే మహేష్ బాబు తో ఏది చేసినా కూడా వరల్డ్ లెవెల్లోనే చేయాలి తప్ప పాన్ ఇండియాలో గాని, లోకల్ సినిమా లెవల్లో గాని చేయకూడదనే ఉద్దేశ్యం తోనే మహేష్ బాబుతో సినిమా చేయబోయే దర్శకులు కేర్ ఫుల్ గా ఉండాలంటూ సినీ విమర్శకులు సైతం వాళ్ళను విమర్శిస్తున్నారు…
.