అందాన్ని రెట్టింపు చేసే అదిరిపోయే హోమ్ రెమెడీ.. దీని ముందు ఫేషియల్ కూడా దండగే!

అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని అందరూ అనుకుంటారు.మచ్చలు, మొటిమలు( Scars, pimples ) లేని తెల్లటి మెరిసే చర్మం కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడతారు.

 Follow This Home Remedy For Beautiful And Glowing Skin! Beautiful Skin, Glowing-TeluguStop.com

తరచూ వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్, బ్లీచ్ వంటివి చేయించుకుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే ఫేషియల్ కూడా దండగే అంటారు.

మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో.దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు( Red lentils ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం( Rice ) వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆపై అరకప్పు వాటర్ వేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి.

గంట త‌ర్వాత‌ మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న బియ్యం మరియు ఎర్ర కంది పప్పును వేసుకోవాలి.అలాగే రెండు బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు( Papaya slices ), రెండు టమాటో స్లైసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Acne Skin, Tips, Remedybeautiful, Skin, Remedy, Latest, Skin Care, Skin C

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు( curd ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ), వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Acne Skin, Tips, Remedybeautiful, Skin, Remedy, Latest, Skin Care, Skin C

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే అదిరిపోయే లాభాలు మీ సొంతమవుతాయి.ఈ రెమెడీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.చర్మ ఛాయను పెంచుతుంది.

మొటిమల సమస్యకు చెక్ పెడుతుంది.మచ్చలు ముడ‌త‌ల‌ను క్రమంగా మాయం చేస్తుంది.

చర్మం టైట్ గా బ్రైట్ గా మారేలా ప్రోత్సహిస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.

మ‌రియు స్కిన్ ను గ్లోయింగ్ గా మెరిపిస్తుంది.సో.సహజంగానే అందంగా కనిపించాలి అనుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube