వైసిపి అధినేత జగన్ కు( YS Jagan ) కంటిలో నలుసులా మారారు ఆమె సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.( YS Sharmila ) ఎన్నికలకు ముందు జగన్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేయడంతో పాటు, టిడిపి అధినేత చంద్రబాబు పై( Chandrababu ) ప్రశంసలు కురిపిస్తూ స్వయంగా చంద్రబాబు లోకేష్ లతో షర్మిల భేటీ కావడం వంటివి అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారాయి.
ముఖ్యంగా తమ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య వ్యవహారంలో కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి పైన, జగన్ పైన తీవ్ర విమర్శలు చేయడం రాజకీయంగా సంచలన సృష్టించాయి.
ఎన్నికలకు ముందు షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసిపికి బాగానే డ్యామజ్ చేశాయి.రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ షర్మిల జగన్ ను టార్గెట్ చేసుకోవడం వంటి వాటిపై అప్పట్లో జగన్ పెద్దగా స్పందించలేదు.అప్పుడప్పుడు పరోక్షంగా సెటైర్లు వేసేవారు ఇప్పుడు ఎన్నికల తంతు ముగిసింది.
వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది .ఇది ఇలా ఉంటే ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం జరుగుతున్న దాడుల వ్యవహారంపై ఈనెల 24వ తేదీన జగన్ ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు తాజాగా షర్మిల జగన్ పై అనేక విమర్శలు చేస్తూ అనేక ప్రశ్నలు సంధించారు.
జగన్ హత్య రాజకీయాలు చేశారని, సొంత చెల్లెళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.” వివేకా హంతకులతో జగన్ తిరుగుతున్నారు.బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు అసెంబ్లీలో ఉండకుండా ఏం చేస్తారు.వినుకొండ హత్య వ్యక్తిగతంగా జరిగింది.అది రాజకీయ హత్య కాదు అని షర్మిల అన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా( AP Special Status ) తీసుకువచ్చే బాధ్యతను సీఎం చంద్రబాబు తీసుకోవాలి అని , వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.