పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు(Archaeologists ,historians) భూమిలో పాతిపెట్టిన ఖజానా కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు.వాళ్లకి అప్పుడప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో విలువైన వస్తువులు దొరుకుతాయి.
ఆ దృశ్యాలను వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేస్తుంటారు అవి చూసి చాలామంది ఆశ్చర్యపోవడం జరుగుతుంది.తాజాగా అలాంటి మరొక వీడియో వైరల్ అయింది.
అందులో ఒకాయన నేలను తవ్వితే అందులో దాగి ఉన్న పాత కుండ (old pot)అతనికి దొరికింది.ఆ కుండ మీద తుప్పు పట్టిన ఇనుప తొడుగు ఉంది.
ఆ కుండలో ఏముందో తెలియక అందరూ ఆసక్తికరంగా చూశారు.
వీడియోలో ఆయన ఆ కుండను భూమి నుంచి బయటకు తీసి, నేలమీద పెట్టి జాగ్రత్తగా తెరవడానికి ప్రయత్నించాడు.కుండ మీద ఉన్న తుప్పు పట్టిన ఇనుప తొడుగును ఒక పనిముట్టుతో జాగ్రత్తగా తొలగించాడు.కుండ తెరిచినప్పుడు లోపల ఏదో కదులుతున్నట్లు కనిపించింది.
అందులో ఒక పాము, కప్ప(A snake, frog) కనిపించాయి.ఆ రెండూ కలిసి విలువైన వస్తువులను కాపలా కాస్తున్నాయి.
ఆ మనిషి జాగ్రత్తగా ఆ పాము, కప్పను బయటకు తీశాడు.ఆ తర్వాత ఆ పాత కుండలో ఏముందో అందరికీ కనిపించింది.
ఆయన మరొక పనిముట్టుతో ఆ కుండ నుంచి ఒక పొడవైన బంగారపు హారాన్ని బయటకు తీశాడు.ఆ తర్వాత దాని మీద చుట్టి ఉన్న వస్త్రాన్ని జాగ్రత్తగా తీసేసాడు.ఆ వస్త్రాన్ని తీసినప్పుడు చాలా చిన్న చిన్న బంగారు నాణేలు కనిపించాయి.ఆ కుండను పూర్తిగా ఖాళీ చేసినప్పుడు వందలాది నాణేలు బయటకు వచ్చాయి.ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు.అది నిజమేనా అని చాలామంది ప్రశ్నించారు.
ఒకరు, “ఆ జీవులు అక్కడ ఎన్ని ఏళ్లుగా ఉండేవి?” అని అడిగారు.మరొకరు, “ఆ ఇనుప తొడుగు మూసి ఉన్నా పాము ఎలా బతికే ఉంది?” అని ఆశ్చర్యపోయారు.ఈ వీడియోను 6 లక్షల మందికి పైగా లైక్ చేశారు.దీన్ని 2 కోట్ల 50 లక్షల మందికి పైగా చూశారు.ఇది ఒక ఫారిన్ కంట్రీలో దొరికిన నిధి లాగా కనిపించింది.దీనిని మీరు కూడా చూసేయండి.