కొబ్బరినూనెలో యాంటీ సెప్టిక్,యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్,విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన పగిలిన పెదాలపై రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.
ఒక బౌల్ లో ఒక స్పూన్ కొబ్బరినూనె,ఒక స్పూన్ తేనే,రెండు స్పూన్ల చక్కెర,రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకొని ఆరాక శుభ్రం చేసుకుంటే ముఖ చర్మం మృదువుగా మారుతుంది.
మొటిమల సమస్యతో ఇబ్బందిగా ఉంటే… గుడ్డు తెల్లసొనలో నాలుగు స్పూన్ల కొబ్బరినూనె,ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
రెండు స్పూన్ల కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసి ముఖానికి రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మీద ఉన్న మురికి మాయం అవుతుంది.గుప్పెడు కరివేపాకు ఆకులకు కొంచెం నీటిని చేర్చి మెత్తని పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని రెండు కప్పుల నూనెలో వేసి మరిగించి వడకట్టి సీసాలో భద్రపరచుకొని, ప్రతి రోజు రాత్రి జుట్టుకు రాసి ఉదయాన్నే కడిగేస్తే జుట్టు నల్లగా మారుతుంది.
ఒక కప్పు కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు,వేప ఆకులు, మందార పూలు వేసి మరిగించి వడకట్టి సీసాలో భద్రపరచాలి.ఈ నూనెను క్రమం తప్పకుండా ప్రతి రోజు జుట్టుకు పట్టిస్తే జుట్టు నల్లగా పొడవుగా పెరుగుతుంది.