బిగ్ బాస్ షో మరొక రెండు వారాల్లో ముగియనుండటంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది.మరొకవైపు పలువురు సెలబ్రిటీలు తమ అభిమాన కంటెస్టెంట్ లను సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే పలువురు తన అభిమాన కంటెస్టెంట్ లకు సపోర్ట్ చేయండి అంటూ ప్రేక్షకులను వేడుకుంటున్నారు.ఫైనల్ ఎపిసోడ్ కు రెండు వారాల గడువు ఉండటం వల్ల మద్దతు ప్రకటిస్తున్నారు సెలబ్రిటీలు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ సింగర్ మధుప్రియ ఇద్దరూ అభిమాన కంటెస్టెంట్ లకు మద్దతు తెలిపింది.అందులో ఒకరు సింగర్ శ్రీ రామ్ చంద్ర కాగా, మరోకరు మానస్.
ఈమె ఇద్దరు కంటెస్టెంట్ లకు మద్దతుగా నిలుస్తూ స్నేహితుడు మానస్ కి ఓట్లు వేసి సేవ్ చేయండి అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో వేడుకుంది.కేవలం మధుప్రియనే కాకుండా యాంకర్ సమీరా, జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అలాగే వెండితెర సెలబ్రిటీ అయినా హీరోయిన్ మాళవిక శర్మ సైతం మానస్ కు అండగా నిలిచారు.
ఈ క్రమంలోనే మానస్ గురించి మాళవిక మాట్లాడుతూ.మానస్ గురించి నేను చాలా విన్నాను.బిగ్ బాస్ హౌస్ లో ఇరగదీస్తున్నాడు.అందరూ అతడికే ఓటు వేస్తారు అని ఆశిస్తున్నాను.నా ఓటు కూడా మానస్ కే.తప్పకుండా మానస్ గెలుస్తాడని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది మాళవిక.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక మరొక రెండు వారాల్లో బిగ్ బాస్ ట్రోపిని ఎవరు గెలుచుకోబోతున్నారో తెలియనుంది.అలాగే ఈ వారం కూడా ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది.