కెనడాలో అడ్వాన్స్‌డ్‌ డ్రగ్ ల్యాబ్ రన్ చేస్తున్న సిక్కు వ్యక్తి.. కట్ చేస్తే..

ఈ రోజుల్లో ఈజీ మనీ కోసం చాలామంది పక్కదారులు పడుతున్నారు.సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ( Movies, webseries )చూసి అందులో చేసిన ఇల్లీగల్ పనులు వారు కూడా చేస్తున్నారు.

 If A Sikh Man Running An Advanced Drug Lab In Canada Gets Cut, Drug Bust, Nri Ne-TeluguStop.com

అయితే సినిమాల్లో హీరోలు పట్టుబడరు కానీ నిజ జీవితంలో తప్పు చేస్తూ తప్పించుకోవడం అసంభవం.వెంటనే దొరికిపోతామనే ఆలోచన లేని చాలామంది మూర్ఖులు ఇలాంటి పనులు చేస్తుంటారు.

తాజాగా గగన్‌ప్రీత్ రంధవా ( Gaganpreet Randhawa )సిక్కు వ్యక్తి కూడా ఇలాంటి పిచ్చి పని చేస్తూ చివరికి పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డాడు.ఇతను కెనడాలోని అతిపెద్ద, అత్యంత ఆధునిక డ్రగ్ ప్రొడక్షన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.

Telugu Canada, Drug Bust, Drug Lab, Fentanyl, Sikhadvanced, Drugs, Methamphetami

ఇక్కడే ఫెంటానిల్, మెథాంఫేటమిన్ ( Fentanyl, methamphetamine )వంటి బ్యాన్డ్‌ డ్రగ్స్ అక్రమంగా తయారు చేస్తున్నాడు.అదే సమయంలో గగన్‌ప్రీత్ రంధవాను పోలీసులు అరెస్టు చేశారు.అతనిపై అనేక మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ( Royal Canadian Mounted Police )(RCMP) తమ దాడుల్లో ఈ ఫెంటానిల్, మెథాంఫేటమిన్ తయారీ కర్మాగారాన్ని కనుగొన్నారు.

కొన్ని గ్యాంగ్స్‌ ఈ మాదకద్రవ్యాలను పెద్ద ఎత్తున తయారు చేసి ప్రపంచ దేశాలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.ఆ గ్యాంగ్‌లను చాకచక్యంగా పట్టుకున్నారు.బ్రిటిష్ కొలంబియాలోని ఫాల్క్‌ల్యాండ్‌లోని( Falkland, British Columbia ) ఒక ప్రత్యేకమైన ల్యాబ్‌ను ఉపయోగించి ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.సర్రీ, మెట్రో వాంకూవర్‌లోని ఇతర ప్రదేశాల నుంచి వీరికి సహాయం అందేది.

గత వారం, పోలీసులు ఈ ప్రదేశాలపై దాడి చేసి భారీ మొత్తంలో మందులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ల్యాబ్ ఇంతకు ముందు వారు చూసిన అతిపెద్ద, అత్యంత అడ్వాన్స్‌డ్‌ ల్యాబ్ అని కేంద్ర దర్యాప్తు అధికారులు తెలిపారు.

ఈ దాడుల్లో, పోలీసులు 54 కిలోల ఫెంటానిల్, 390 కిలోల మెథాంఫేటమిన్, 35 కిలోల కోకెయిన్, 15 కిలోల ఎమ్‌డిఎమ్‌ఎ, 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Telugu Canada, Drug Bust, Drug Lab, Fentanyl, Sikhadvanced, Drugs, Methamphetami

పోలీసులు 89 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.వీటిలో 45 హ్యాండ్‌గాన్లు, 21 ఏఆర్-15 రకం రైఫిల్స్, అనేక సబ్‌మెషిన్ గన్‌లు ఉన్నాయి.ఇవన్నీ లోడ్ చేయబడి ఉన్నాయి.

వీటిలో తొమ్మిది తుపాకులు దొంగతనం చేసినట్లు తెలిసింది.అంతేకాకుండా, చిన్న పేలుడు పదార్థాలు, తుపాకులకు సంబంధించిన అదనపు భాగాలు, అధిక శక్తి గల మ్యాగజైన్‌లు, శరీర కవచాలు, 5 లక్షల డాలర్ల నగదును కూడా పోలీసులు కనుగొన్నారు.

పసిఫిక్ ప్రాంతం కోసం ఆర్‌సీఎంపీ ఫెడరల్ పోలీసింగ్ ప్రోగ్రామ్‌కు అధిపతిగా ఉన్న అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ తెబౌల్ మాట్లాడుతూ, ఫెంటానిల్, ఎమ్‌డిఎమ్‌ఎ తయారీకి ఉపయోగించే 5,000 లీటర్లకు పైగా, 10 టన్నుల రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.మెథాంఫెటమైన్ తయారీకి ఉపయోగించే ఫెనైల్-2-ప్రొపానోన్ (P2P) అనే రసాయనాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు.

ఈ రసాయనం పశ్చిమ కెనడాలో ఇంతకు ముందు కనిపించలేదు.ఈ పద్ధతిని తరచుగా మెక్సికన్ కార్టెల్‌లు ఉపయోగిస్తారు, ఇది ఈ ప్రాంతానికి కొత్త.

ఈ ఆపరేషన్‌ను బ్రేకింగ్ బ్యాడ్ అనే టీవీ సిరీస్‌లో చూపించిన డ్రగ్ ఎంపైర్‌తో పోల్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube