తెలంగాణలో సాయంత్రం 4 గంటలకే చీకటయ్యే గ్రామం.. "క" మూవీకి ఆ గ్రామానికి లింక్ ఉందా?

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “క” ( KA )ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్ల విషయంలో అదరగొట్టిందనే చెప్పాలి.ఈ సినిమా మధ్యాహ్నం 3 గంటలకే చీకటి అవుతుంది.

 Telangana Village Kodurupaka Specialities Details Inside Goes Viral In Social Me-TeluguStop.com

మరి రియల్ లైఫ్ లో ఇలాంటి గ్రామాలు ఉంటాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది.ఈ సినిమాకు ఇప్పటివరకు ఏకంగా 19.41 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.దీపావళి పండుగ రియల్ విన్నర్ క మూవీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ జిల్లాలలో ఒకటైన పెదపల్లి జిల్లాలో కొదురుపాక( kodurupaka ) అనే గ్రామం క సినిమాలో చూపించిన తరహా గ్రామం కావడం గమనార్హం.ఈ ఊరి చుట్టూ కొండలు ఉండగా సాయంత్రం 4 గంటలకు మొత్తం చీకటి అవుతుంది.

సూర్యోదయం సైతం ఈ గ్రామంలో ఆలస్యంగా జరుగుతుందని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.

Telugu Ka, Kiran Abbavaram, Kodurupaka, Sujeet Sandeep, Telangana-Latest News -

క మూవీ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కొదురుపాక గ్రామం పేరు మారుమ్రోగుతోంది.రియల్ లైఫ్ లో ఇలాంటి ఒక గ్రామం ఉందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.క సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

క్రేజ్ ఉన్న టాప్ డైరెక్టర్లు కిరణ్ అబ్బవరంతో సినిమా తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

Telugu Ka, Kiran Abbavaram, Kodurupaka, Sujeet Sandeep, Telangana-Latest News -

“క” సక్సెస్ తో కిరణ్ అబ్బవరంపై బరువు బాధ్యతలు మరింత పెరిగాయని మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకోవాల్సిన బాధ్యత పెరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.క సినిమా సక్సెస్ తో మరిన్ని కొత్త తరహా కథాంశాలతో సినిమాలు తెరకెక్కే దిశగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగులు పడుతున్నాయి.సస్పెన్స్ థ్రిల్లర్స్ కు ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది.

క సినిమాలో ఊహించని ట్విస్టులు ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయి.ఈ సినిమా దర్శకులు సుజీత్ సందీప్ లకు క్రేజ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube