తెలంగాణలో సాయంత్రం 4 గంటలకే చీకటయ్యే గ్రామం.. “క” మూవీకి ఆ గ్రామానికి లింక్ ఉందా?
TeluguStop.com
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా "క" ( KA )ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్ల విషయంలో అదరగొట్టిందనే చెప్పాలి.
ఈ సినిమా మధ్యాహ్నం 3 గంటలకే చీకటి అవుతుంది.మరి రియల్ లైఫ్ లో ఇలాంటి గ్రామాలు ఉంటాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది.
ఈ సినిమాకు ఇప్పటివరకు ఏకంగా 19.41 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
దీపావళి పండుగ రియల్ విన్నర్ క మూవీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ జిల్లాలలో ఒకటైన పెదపల్లి జిల్లాలో కొదురుపాక( Kodurupaka ) అనే గ్రామం క సినిమాలో చూపించిన తరహా గ్రామం కావడం గమనార్హం.
ఈ ఊరి చుట్టూ కొండలు ఉండగా సాయంత్రం 4 గంటలకు మొత్తం చీకటి అవుతుంది.
సూర్యోదయం సైతం ఈ గ్రామంలో ఆలస్యంగా జరుగుతుందని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. """/" /
క మూవీ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కొదురుపాక గ్రామం పేరు మారుమ్రోగుతోంది.
రియల్ లైఫ్ లో ఇలాంటి ఒక గ్రామం ఉందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
క సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
క్రేజ్ ఉన్న టాప్ డైరెక్టర్లు కిరణ్ అబ్బవరంతో సినిమా తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
"""/" /
"క" సక్సెస్ తో కిరణ్ అబ్బవరంపై బరువు బాధ్యతలు మరింత పెరిగాయని మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకోవాల్సిన బాధ్యత పెరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
క సినిమా సక్సెస్ తో మరిన్ని కొత్త తరహా కథాంశాలతో సినిమాలు తెరకెక్కే దిశగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగులు పడుతున్నాయి.
సస్పెన్స్ థ్రిల్లర్స్ కు ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది.క సినిమాలో ఊహించని ట్విస్టులు ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయి.
ఈ సినిమా దర్శకులు సుజీత్ సందీప్ లకు క్రేజ్ పెరుగుతోంది.
డెలివరీ తర్వాత జుట్టు పల్చగా మారిపోయిందా.. అయితే ఈ హెయిర్ రీగ్రోత్ టానిక్ మీకోసమే!