ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం ఫ్రూట్స్( Fruits ).మనకు అందుబాటులో ప్రస్తుతం ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి.
ఒక్కో పండు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలను పండ్లు కలిగి ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా పండ్లు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.అలాగే అనేక జబ్బుల నుంచి రక్షిస్తాయి.
అయితే ఫ్రూట్స్ తినేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రూట్స్ ను లంచ్ లేదా డిన్నర్ చేసిన వెంటనే తినరాదు.భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే జీర్ణక్రియ ప్రక్రియ ఆలస్యం అవుతుంది.అదే సమయంలో పోషకాల శోషణకు సైతం అడ్డంకులు ఏర్పడతాయి.అలాగే ఫ్రూట్స్ ను పాలు మరియు పాల ఉత్పత్తులతో జత చేసి తీసుకోరాదు.
పాలు, పెరుగు, చీజ్ వంటి డైరీ ప్రొడక్ట్స్ తో ఫ్రూట్స్ తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

సూర్యాస్తమయం తర్వాత ఫ్రూట్స్ దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.సాయంత్రం ఆలస్యంగా ఫ్రూట్స్ ను తీసుకుంటే నిద్రకు భంగం కలుగుతుంది.మరియు జీర్ణక్రియకు సైతం ఆటంకాలు కలుగుతాయి.
అలాగే తీపి పండ్లను ఆమ్లా పండ్లతో కలిపి ఎప్పుడు తీసుకోకూడదు.అంటే ఆరెంజ్ ద్రాక్ష ( Orange, grapes )వంటి ఆమ్లా పండ్లకు అరటిపండు( banana ) వంటి స్వీట్ పండ్లను చేర్చి తీసుకోకూడదు.

ఆమ్లా పండు మరియు తీపి పండ్లు కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.ఇక ఫ్రూట్స్ ను జ్యూస్ ల రూపంలో కంటే నేరుగా తీసుకోవడమే చాలా ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.ఫ్రూట్ జ్యూస్ లు రుచికరంగా ఉండవచ్చు.కానీ అవి హెల్త్ పరంగా మంచివి కావు.ఎందుకంటే ఫ్రూట్స్ ను జ్యూస్ తయారు చేసే ప్రాసెస్ లో అవి వాటి ఫైబర్ కంటెంట్ ను కోల్పోతాయి.పైగా జ్యూసుల్లో షుగర్ యాడ్ చేస్తుంటారు.
అందువల్ల అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి కాబట్టి జ్యూస్ రూపంలో కాకుండా ఫ్రూట్స్ ను డైరెక్ట్ గా తినడమే చాలా మంచిది.