ఒకే ఇంట్లో నలుగురు భవిష్యత్ డాక్టర్లు.. ఈ విద్యార్థుల తండ్రి కష్టం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఒకే ఇంట్లో నలుగురు మెడిసిన్ లో సీట్ సాధించడం సాధారణమైన విషయం కాదు.ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తున్న ఈ విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు అయ్యే అవకాశం అయితే ఉంది.

 Four Girls Inspirational Success Story Details Inside Goes Viral In Social Media-TeluguStop.com

ఒకే ఇంట్లో నలుగురు కాబోయే డాక్టర్లు ఉండటం సాధారణ విషయం కాదు.సిద్ధిపేటలోని నర్సాపూర్ కాలనీకి చెందిన రామచంద్రం, శారద ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించారు.

ఈ దంపతులకు మమత, మాధురి, రోహిణి, రోషిణి పేర్లతో నలుగురు కూతుళ్లు ఉన్నారు.

ఈ నలుగురు కూతుళ్లలో రోహిణి, రోషిణి (Rohini, Roshini)కవలలు కావడం గమనార్హం.

రామచంద్రం దర్జీ పని చేస్తూ రెక్కల కష్టాన్ని నమ్ముకుని సంపాదించిన డబ్బుతో పిల్లల్ని చదివించారు.పెద్ద కూతురైన మమత (Mamata) పదో తరగతిలో మంచి మార్కులు సాధించి ఏడాది లాంగ్ టర్మ్ శిక్షణ తర్వాత నీట్ పరీక్షలో సైతం మంచి మార్కులు సాధించింది.

విజయవాడలోని సిద్దార్థ ప్రభుత్వ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ (Siddhartha medical College hospital)పూర్తి చేసింది.

Telugu Chalmedaananda, Madhuri, Mamata, Mbbs, Rohini, Roshini-Inspirational Stor

ప్రస్తుతం మమత పీజీకి సిద్ధమవుతున్నారు.ఆ తర్వాత మాధురి సైతం మమత పయనించిన దారిలో నడిచారు.కరీంనగర్ లోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో(Chalmeda Ananda Rao Medical College) ఈమె ఎంబీబీఎస్(MBBS) నాలుగో సంవత్సరం చదువుతున్నారు.

అక్కల స్పూర్తితో రోహిణి, రోషిణి ప్రిపేర్ కాగా ఈ ఏడాది నీట్ రాయగా జగిత్యాలలోని గవర్నమెంట్ కాలేజ్ లో ఇద్దరికీ సీట్ వచ్చింది.

Telugu Chalmedaananda, Madhuri, Mamata, Mbbs, Rohini, Roshini-Inspirational Stor

కొంతమంది చేసిన నెగిటివ్ కామెంట్స్ బాధించాయని ఈ నలుగురు భవిష్యత్తు డాక్టర్లు చెబుతున్నారు.మాలో మేము పట్టుదలను పెంచుకుని లక్ష్యాన్ని సాధించామని వాళ్లు చెబుతున్నారు.దర్జీ పని చేస్తూ పిల్లల్ని చదివించిన తండ్రి కష్టాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

అమ్మాయిలను ఎప్పుడూ చులకనగా చూడొద్దని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ విద్యార్థులను చదివించడానికి తండ్రికి ఏడాదికి 6 లక్షల రూపాయల ఖర్చు అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube