సినిమాలు అన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్.హిట్ వస్తే సినిమా చేసిన నటులతో పాటు దర్శకుడికి మంచి పేరు వస్తుంది.
నిర్మాతకు కాసుల వర్షం కురుస్తుంది.అయితే కొన్నిసార్లు సినిమాలు డిజాస్టర్లు కావడంతో నిర్మాతలు కోలుకోలేని దెబ్బతింటారు.
అలాంటి సందర్భాల్లో హీరోలు, హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ డబ్బులు తిరిగి ఇవ్వడం.లేదంటే మరో సినిమాలో డబ్బులు తీసుకోకుండా నటించడం చేస్తారు.
ఇప్పటి వరకు పలువురు టాప్ నటులు, దర్శకుడు సినిమాలు ఫ్లాప్ అయి కష్టాల్లో ఉన్న నిర్మాతలను ఆదుకున్నారు.ఇంతకీ వారెవరో ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.మహేష్ బాబుమహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ఖలేజా.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.నిర్మాతకు భారీగా నష్టం చేకూర్చింది.ఈ సమయంలో మహేష్ బాబు తన రెమ్యునరేషన్ అంతా తిరిగి ఇచ్చాడు.పవన్ కల్యాణ్
ఈయన నటించిన జానీ, కొమురంపులి సినిమాలు కూడా ఘోర పరాభాన్ని చవి చూశాయి.ప్రొడ్యూసర్లకు పెద్ద దెబ్బకొట్టాయి.పవన్ కల్యాన్ తీసుకున్న రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చాడు.రాంచరణ్
మెగా వారసుడు రాంచరణ్ నటించిన ఆరెంజ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.తను కూడా తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చాడు.జూనియర్ ఎన్టీఆర్జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు సినిమా ఘోర పరాజయం పొందింది.
ఈ సందర్భంలో తన రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చి నిర్మాతను ఆదుకున్నాడు.త్రివిక్రమ్పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞతవాసి సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చాడు.బాలకృష్ణ
నిర్మాతలను ఆదుకోవడంలో ముందుంటాడనే పేరుంది బాలకృష్ణకు.తాజాగా ఆయన నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఫ్లాప్ అయ్యింది.రాంచరణ్రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అయ్యింది.
దీంతో హీరో రామ్ చరణ్ తో పాటు దానయ్య కలిసి డిస్టిబ్యూటర్లకు 5 కోట్ల రూపాయలు ఇచ్చారు.సాయి పల్లవిసాయిపల్లవి నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
దీంతో తన రెమ్యునరేషన్ ను సాయి పల్లవి వెనక్కి ఇచ్చింది.విజయ్ దేవరకొండవిజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా భారీ ఫ్లాప్ అయ్యింది.
తన పారితోషకాన్ని విజయ్ వెనక్కి ఇచ్చాడు
.