ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి ఇకపై లేదు.. దీని ప్రత్యేకతలు తెలిస్తే..

ఈ ప్రపంచంలో ఎన్నో అతి పెద్ద జీవులు ఉన్నాయి వాటిలో మొసలి కూడా ఒకటి.మొసళ్లు వెయ్యి కిలోల కంటే ఎక్కువ బరువు పెరగగలవు.20 అడుగుల కంటే పొడవుగా ఉండగలవు.ఆస్ట్రేలియాలో ( Australia )సైతం ఇలాంటి ఒక అతిపెద్ద మొసలి ఉంది.

 The Biggest Crocodile In The World Is No More, If You Know Its Special Features,-TeluguStop.com

దీన్ని బంధించారు.బంధించిన అన్ని మొసళ్లలోకెల్లా ఇదే అతి పెద్దది.

ఇదొక ఉప్పు నీటి మొసలి.దీని పేరు కాసియస్( Cassius ).ఇది గ్రేట్ బ్యారియర్ రీఫ్‌లోని గ్రీన్ ఐలాండ్‌లో ( Green Island in the Great Barrier Reef )నివసిస్తూ వచ్చింది.18 అడుగుల పొడవున్న ఈ మొసలికి 110 సంవత్సరాలకు పైగా వయసు ఉంటుందని భావిస్తున్నారు.ఆ వయసులో తాజాగా ఈ ముసలి మరణించింది.2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కాసియస్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద బంధిత మొసలిగా గుర్తించింది.

మరైన్‌లాండ్ మెలనీషియా క్రొకొడైల్ హాబిటాట్ ( Marineland Melanesia Crocodile Habitat )శనివారం కాసియస్ మరణం గురించి వార్తను ప్రకటించింది.“మా ప్రియమైన స్నేహితుడు కాసియస్ మరణించినందుకు మేం చాలా విచారంగా ఉన్నాం.” అని ఒక ప్రతినిధి అన్నారు.“కాసియస్ కేవలం ఒక మొసలి మాత్రమే కాదు.అది మా కుటుంబంలో ప్రియమైన భాగం.అతను తన స్నేహితుడు జార్జ్‌కు 37 సంవత్సరాలకు పైగా ఆనందాన్ని, స్నేహాన్ని అందించాడు.” అని పేర్కొన్నారు.అక్టోబర్ 15 నుంచి కాసియస్ ఆరోగ్యం క్షీణించిందని వారు అన్నారు.

Telugu Australia, Cassius, Crocodile, Green Island, Guinness, Nri-Telugu NRI

కాసియస్ మొసలి వెయ్యి కిలోల కంటే ఎక్కువ బరువు ఉండేది.1980లలో దాన్ని పట్టుకున్నప్పుడు, దాని వయసు 30-80 ఏళ్ల మధ్య ఉంటుందని అనుకున్నారు.ఇతర మొసళ్ల కంటే చాలా ఎక్కువ కాలం జీవించిందని భావిస్తున్నారు.దాన్ని చూసుకునే తూడీ స్కాట్ దాన్ని “స్వీట్‌హార్ట్”( Sweetheart ) అని పిలిచేవారు.ఆయన అభిప్రాయం ప్రకారం, కాసియస్ కళ్లలో చూస్తే దాని ఆత్మ కనిపిస్తుందట.2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో మాట్లాడుతూ, కాసియస్ చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటుందని ఆయన చెప్పారు.“దాని కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి, వాటిలో ఎప్పటికీ చూడవచ్చు” అని అన్నారు.“ఇతర మొసళ్ల కంటే ఇది చాలా సున్నితంగా ఉంటుంది, కానీ అది తెలివైనదని మనం మర్చిపోకూడదు.దాన్ని సంతోషపెట్టడానికి ఉత్తమ మార్గం ఆహారం ఇవ్వడం.అంతేకాకుండా, ఇది మొసళ్ల భూమి, కాబట్టి మొసళ్ల చుట్టూ జాగ్రత్తగా ఉండటం మంచిది.” అని వివరించారు.

Telugu Australia, Cassius, Crocodile, Green Island, Guinness, Nri-Telugu NRI

కాసియస్ అనే ఈ మొసలి 1903లో జన్మించి ఉంటుందని అంచనా.1987లో, దీన్ని ఆస్ట్రేలియాలోని ఉత్తర భూభాగంలోని డార్విన్‌కు దక్షిణాన ఉన్న ఫిన్నిస్ నది నుండి ట్రక్‌లో జంతుప్రదర్శనశాలకు తీసుకువచ్చారు.ఈ మొసలి ముక్కు భాగం, తోక భాగం లేకుండా ఉంది.

మిగతా మొసళ్లతో గొడవలు పడటం వల్ల ఇలా జరిగిందని మిస్టర్ స్కాట్ చెప్పారు.ఈ భాగాలు లేకున్నా, కాసియస్ పొడవును రికార్డు కోసం తగ్గించలేదు.2011 తర్వాత దాన్ని మళ్లీ కొలవలేదు.ఇది ఇలా ఉంటే ఫిలిప్పీన్స్‌లో లోలాంగ్ అనే మొసలి కాసియస్‌ ఎక్కువ పొడవు, బరువుతో రికార్డును నెలకొల్పింది.

లోలాంగ్ మొసలి 2011లోనే 20 అడుగుల 3 అంగుళాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.అయితే, 2013లో లోలాంగ్ మరణించిన తర్వాత కాసియస్ తన రికార్డును తిరిగి దక్కించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube