సినిమా ఇండస్ట్రీలో నందమూరి (Nandamuri) కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.నందమూరి వారసులుగా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ (Ntr) కొనసాగుతున్నారు.
త్వరలోనే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ(Mokshagna) కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఇప్పటికే మూడు తరాల వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా త్వరలోనే నాలుగో తరం వారసులు కూడా ఇండస్ట్రీ లోకి రాబోతున్నారు.
హరికృష్ణ (Harikrishna) పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు(Janakiram’s son Nandamuri Taraka Rama Rao) హీరోగా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు.
![Telugu Nandamuri, Bhuvaneswari, Taraka Ramamrao, Tollywood, Yvs Chowdary-Movie Telugu Nandamuri, Bhuvaneswari, Taraka Ramamrao, Tollywood, Yvs Chowdary-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/Yvs-Chowdary-react-on-Nara-Bhuvaneswari-tweet-b.jpg)
ఈ హీరోని డైరెక్టర్ వైవిఎస్ చౌదరి(YVS Chowdary )ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇలా నందమూరి తారక రామారావు హీరోగా ఎం చేయబోతున్న తరుణంలో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంటి వారందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ద బెస్ట్ తెలిపారు.
![Telugu Nandamuri, Bhuvaneswari, Taraka Ramamrao, Tollywood, Yvs Chowdary-Movie Telugu Nandamuri, Bhuvaneswari, Taraka Ramamrao, Tollywood, Yvs Chowdary-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/11/Yvs-Chowdary-react-on-Nara-Bhuvaneswari-tweet-c.jpg)
ఇక నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) సైతం నందమూరి రామ్ హీరోగా రాబోతున్న నేపథ్యంలో ఆమె కూడా అభినందనలను తెలిపారు.ఎన్టీఆర్తో పాటు, నిర్మాణ సంస్థకు, దర్శకుడు వైవిఎస్కు, టీమ్ అందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలోనే డైరెక్టర్ వైవిఎస్ చౌదరి నారా భువనేశ్వరి పోస్ట్ పై స్పందించారు.శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సముఖమునకు అమ్మా.నా దర్శకత్వం నందమూరి నాలుగో తరం వారసురుని పరిచయం చేస్తూ విడుదల చేసిన షో రీల్ చూసి మా కథానాయకుడు ఎన్.టి.ఆర్ నీ మరియూ నన్నూ అభినందించడం.మాకెంతో సంతోషాన్ని, మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది.
మా అన్న ఎన్టీఆర్ అభిమానులు ఏ సమస్యతో మీ వద్దకు వచ్చిన మీ సొంత కుటుంబ సభ్యునిగా చేరదీసి ఆదుకున్న మీలోని అమ్మతనం మేమెప్పటికీ మరిచిపోలేనిది.మీ బుుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనిదని సంతోషం వ్యక్తం చేస్తూ ఈయన చేసిన పోస్టు వైరల్ అవుతుంది.