మొటిమలు ( Acne ) మరియు వాటి తాలూకు గుర్తులతో ముఖ చర్మం మొత్తం పాడవుతుందా.? వాటిని వదిలించుకునేందుకు రకరకాల క్రీములు, సీరమ్‌లు వాడుతున్నారా.? క్లియర్ స్కిన్ ను పొందడం కోసం ఆరాటపడుతున్నారా.? చర్మాన్ని అందంగా కాంతివంతంగా మెరిపించుకోవాలని భావిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీతో చాలా ఈజీగా మొటిమలు మరియు వాటి తాలూకు గుర్తులను వదిలించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ( Home Remedy ) గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వేప పొడిని( Neem Powder ) వేసుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చందనం పొడి,( Sandalwood ) చిటికెడు ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా పచ్చి పాలు వేసుకుని అన్నిటిని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ సింపుల్ ఇంటి చిట్కాను పాటించారంటే మొటిమలు, వాటి తాలూకు గుర్తులతో వర్రీ అవ్వాల్సిన అవసరమే ఉండదు.వేప పొడి, చందనం, పసుపు, తేనె మరియు పాలు లో ఉండే పలు ప్రత్యేక గుణాలు మొటిమలను చాలా వేగంగా తగ్గిస్తాయి.మొటిమలు తాలూకు గుర్తులను మాయం చేస్తాయి.

మొటిమలు, మచ్చలు లేని క్లియర్ స్కిన్ ను పొందాలని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ఫాలో అవ్వండి.పైగా ఈ ఇంటి చిట్కాను పాటించడం వల్ల చర్మ ఛాయ మెరుగు పడుతుంది.చర్మం తేమగా ఉంటుంది.అదే సమయంలో స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మరియు బ్యూటిఫుల్ గా సైతం మెరిసిపోతుంది.