వావ్, పక్షిని అద్భుతంగా క్యాచ్ పట్టిన టైగర్‌ఫిష్.. వీడియో వైరల్‌..

సముద్రంలో ఎన్నో రకాల జీవులు ఉంటాయి.నేలపై పులులు సింహాలు, ఏనుగులు జిరాఫీలు ఎలా ఉంటాయో సముద్రాల్లో కూడా చురుకైన, దూకుడు స్వభావం గల జలచరాలు ఉంటాయి.

 Viral Video African Tigerfish Jaw-dropping Bird Hunt Details, Viral Video, Viral-TeluguStop.com

ముఖ్యంగా చేపలు అద్భుతమైన సామర్థ్యాలతో ఆశ్చర్యపరుస్తుంటాయి.అలాంటి వాటిలో ఆఫ్రికన్‌ టైగర్ ఫిష్( African Tigerfish ) ఒకటి.

దీని వేటాడే నైపుణ్యాలను చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.తాజాగా ఇది తన హంటింగ్ స్కిల్స్( Hunting Skills ) ప్రదర్శించి వావ్ అనిపించింది.

చేపలు వేటాడేటప్పుడు చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి, గాలిలో వేగంగా ఎగురుతున్న పక్షులను కూడా ఈజీగా పట్టుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.ఇటీవల నమీబియా_ఆఫ్రికా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న ఒక వీడియోలో ఈ నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది

ఆఫ్రికాలోని( Africa ) చోబే, జాంబెజీ నదుల్లో ఈ టైగర్ ఫిష్ నివసిస్తోంది.ఈ చేపకు చాలా పదునైన, బలమైన పళ్లు ఉన్నాయి.అంతేకాదు, ఇది చాలా క్రూరంగా వేటాడుతుంది.ఈ చేప నీటిలో నుంచి పైకి ఎగిరి, గాలిలో ఎగురుతున్న పక్షులను( Birds ) పట్టుకుంటుంది.2014లో మొదటిసారిగా శాస్త్రవేత్తలు దీన్ని చూసి ఆశ్చర్యపోయారు.నీటి నుంచి ఎగిరి పక్షులను పట్టుకోవడానికి టైగర్ ఫిష్ చాలా వేగంగా కదులుతుంది.అది ఒక్కసారి ఏ పక్షి పైనైనా టార్గెట్ పెట్టిందంటే దానికి అది దొరికి తీరాల్సిందే.

ఇది చాలా తెలివైన వేటరి అని అర్థమవుతుంది.నీటిలో నివసించే చేప ఇలా చేయడం చాలా అద్భుతం.

ఇది టైగర్ ఫిష్ ఎంతటి భయంకరమైన హంటరో చూపిస్తుంది.

నమీబియా_ఆఫ్రికా అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో టైగర్ ఫిష్ చేపల అరుదైన వేటాడే విధానాన్ని చూడవచ్చు.ఈ వీడియోలో చేప నీటి నుంచి బలంగా బయటకు దూకి, గాలిలో ఎగురుతున్న పక్షిని చాలా కచ్చితంగా పట్టుకుంది.ప్రకృతిలో వేటాడే జంతువులు, వాటి వేటాడబడే జంతువుల మధ్య ఎంత ఘోరమైన పోరాటం జరుగుతుందో ఈ వీడియో చూపిస్తుంది.

దీన్ని మీరు కూడా చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube