ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు..!

ప్ర‌స్తుత రోజుల్లో ఎంతో మంది చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు.మోకాళ్ళ నొప్పుల( Knee pain ) వల్ల ఏ పనీ ఎక్కువ సమయం పాటు చేయలేరు.

 If You Eat This Laddu Once A Day, You Can Say Goodbye To Knee Pain! Knee Pain, L-TeluguStop.com

కాసేపు నడవడానికి, నిలబడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పులను వదిలించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే లడ్డూను మీరు కచ్చితంగా తినాల్సిందే.మోకాళ్ళ నొప్పులను వదిలించడంలో ఈ లడ్డు ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

Telugu Finger Millet, Tips, Knee Pain, Laddu, Latest, Ragi Laddu, Ragiladdu-Telu

దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి మరియు ఒక కప్పు రాగి పిండి వేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒకటిన్నర కప్పు వేరుశనగలు వేసి వేయించుకొని పొట్టు తొలగించి కాస్త బరకగా పొడి చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక కప్పు బెల్లం( Jaggery ) లో కొద్దిగా వాటర్ పోసి ఉడికించాలి.

తీగపాకం రాగానే రాగి పిండి, వేరుశనగ పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Telugu Finger Millet, Tips, Knee Pain, Laddu, Latest, Ragi Laddu, Ragiladdu-Telu

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకుని స్టోర్ చేసుకోవాలి.ఈ రాగి లడ్డూలను రోజుకొకటి చొప్పున తీసుకుంటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు.ఈ రాగి లడ్డూలో కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.

ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది.బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.

ఎముకలు బలహీనంగా, పెలుసుగా మారకుండా అడ్డుకుంటుంది.మోకాళ్ళ నొప్పులను సమర్థవంతంగా వ‌దిలిస్తుంది కాబ‌ట్టి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రాగి లడ్డూను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

పైగా ఈ రాగి లడ్డు మంచి జీవక్రియ కు మద్దతు ఇస్తుంది.మధుమేహం వచ్చే రిస్క్ ని తగ్గిస్తుంది.

రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.

వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.మరియు ఈ రాగి లడ్డు మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా సైతం ఉంచుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube