ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు..!

ప్ర‌స్తుత రోజుల్లో ఎంతో మంది చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు.మోకాళ్ళ నొప్పుల( Knee Pain ) వల్ల ఏ పనీ ఎక్కువ సమయం పాటు చేయలేరు.

కాసేపు నడవడానికి, నిలబడటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పులను వదిలించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే లడ్డూను మీరు కచ్చితంగా తినాల్సిందే.

మోకాళ్ళ నొప్పులను వదిలించడంలో ఈ లడ్డు ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది. """/" / దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి మరియు ఒక కప్పు రాగి పిండి వేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒకటిన్నర కప్పు వేరుశనగలు వేసి వేయించుకొని పొట్టు తొలగించి కాస్త బరకగా పొడి చేసుకుని పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక కప్పు బెల్లం( Jaggery ) లో కొద్దిగా వాటర్ పోసి ఉడికించాలి.

తీగపాకం రాగానే రాగి పిండి, వేరుశనగ పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

"""/" / ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకుని స్టోర్ చేసుకోవాలి.

ఈ రాగి లడ్డూలను రోజుకొకటి చొప్పున తీసుకుంటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు.

ఈ రాగి లడ్డూలో కాల్షియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది.

బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.ఎముకలు బలహీనంగా, పెలుసుగా మారకుండా అడ్డుకుంటుంది.

మోకాళ్ళ నొప్పులను సమర్థవంతంగా వ‌దిలిస్తుంది కాబ‌ట్టి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రాగి లడ్డూను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

పైగా ఈ రాగి లడ్డు మంచి జీవక్రియ కు మద్దతు ఇస్తుంది.మధుమేహం వచ్చే రిస్క్ ని తగ్గిస్తుంది.

రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.

వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.మరియు ఈ రాగి లడ్డు మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా సైతం ఉంచుతుంది.

రేవంతే టార్గెట్ గా బీఆర్ఎస్ భారీ వ్యూహం ?