రాజకీయాలలో నాకు ఎలాంటి ఆశలు లేవు.. నా జీవితం వాళ్లకే అంకితం: నాగబాబు

సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీగా గుర్తింపు సంపాదించుకున్న కుటుంబంలో మెగా ఫ్యామిలీ ఒకటి.ఇక ఈ కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) చిరంజీవి ( Chiranjeevi ) స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

 Nagababu Interesting Comments On Chiranjeevi And Pawan Kalyan In Janasena Meetin-TeluguStop.com

ఇక్కడ నిర్మాతగా నాగబాబు ( Nagababu ) కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసినదే .జనసేన పార్టీని (Janasena Party) స్థాపించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకుంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి నాగబాబు కూడా జనసేన పార్టీ కోసం పెద్ద ఎత్తున కష్టపడుతూ పనిచేస్తున్నారు.

Telugu Ap, Chiranjeevi, Janasena, Nagababu, Pawan Kalyan-Movie

కూటమిలో భాగంగా తన సీటును కూడా త్యాగం చేసి కూటమి విజయానికి నాగబాబు ఎంతో కష్టపడి పని చేస్తారని చెప్పాలి.అయితే తాజాగా మంగళగిరిలో జరిగిన జనసేన( Janasena Party) క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.నేను నిర్మాతగా కోట్ల రూపాయలు నష్టపోయినప్పుడు నా పక్కన నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అండగా నిలిచారు.

Telugu Ap, Chiranjeevi, Janasena, Nagababu, Pawan Kalyan-Movie

ఈ జీవితం వాళ్ళ ఆశయాల కోసమే.వాళ్ళ కోసం నిలబడి నాకు చేతనైనంత వరకు సేవ చేస్తాను.రాజకీయాల్లో నాకంటూ ఎటువంటి ఆశలు లేవు.ఎటువంటి పదవి కాంక్షలేదు.మనం గొప్పవాళ్లు కాకపోవచ్చు కానీ గొప్ప వాళ్ళకి అండగా నిలబడాలి పవన్ కళ్యాణ్ ఆశయం కోసం నా వయసు సహకరించినంత వరకు నేను కష్టపడి పని చేస్తూ ఉంటాను.ఇక ఆంధ్రాలో కూటమి అధికారంలోకి రావడం పవన్ డిప్యూటీ సీఎం కావడం మన అదృష్టం అంటూ ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube