సాధారణంగా మూవీ యాక్టర్స్ వారి వర్క్ పట్ల ఎక్కువగా డెడికేషన్ చూపిస్తారు.కొందరైతే సన్నివేశాలు బాగా రావాలని చాలా కష్టపడుతుంటారు.
డైరెక్టర్లు చెప్పకపోయినా రీటేక్స్ తీసుకొని మరీ పదేపదే ఒకే సన్నివేశాన్ని చేస్తుంటారు.ఇక టాలీవుడ్ లోనూ ఇలాంటి నటీనటులు ఉన్నారు.
చిన్న సీన్ కోసం కూడా ఎన్నో టేక్స్ తీసుకున్న యాక్టర్లు సైతం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నారు.వారెవరో తెలుసుకుందాం.
అల్లు అర్జున్:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun: ) పుష్ప-1 సినిమాతో వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.ఇందులో పుష్పరాజ్ పాత్రకు 100% న్యాయం చేయడానికి బన్నీ చాలానే కష్టపడ్డాడు.దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను ప్రాక్టీస్ చేశాడు.అంతేకాదు మేకప్ వేసుకోవడం, తీసుకోవడం కోసం చాలా సమయం వెచ్చించాడు.తీవ్రమైన ఇబ్బందిని భరించాడు.అందుకు ప్రతిఫలం దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ హీరోకి మంచి గుర్తింపు వచ్చింది.అయితే ఈ గుర్తింపుతో బన్నీ సరిపెట్టుకోవడం లేదు.పుష్ప-2 సినిమాతో నటుడిగా మరో లెవెల్ కి చేరుకోవడానికి సిద్ధమయ్యాడు.అందుకు నిదర్శనంగా ఒక సంఘటన నిలుస్తుంది.
ఈ మూవీలో ఒక టైటిల్ సాంగ్ లాంటిది ఉంటుంది.ఇందులో బన్నీ సెల్‌ఫోన్‌తో ఒక స్టెప్ చేస్తాడు.
అయితే ఈ సీన్ పర్ఫెక్ట్ గా రావాలని బన్నీ ఏకంగా 42 టేక్స్ తీసుకున్నాడట.దీన్ని బట్టి బన్నీ డెడికేషన్ ఏ లెవెల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అక్కినేని అఖిల్
యాక్షన్ ఫాంటసీ ఫిలిం అఖిల్ (2015) మూవీలో హీరో హీరోయిన్ పెదాలపై నుంచి ఐస్‌క్రీమ్ తీసుకునే ఒక సీన్ ఉంటుంది.అయితే ఇది మంచిగా రావాలని అక్కినేని అఖిల్ 16 టేక్స్ తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఈ చిత్రంలో అఖిల్ కు జంటగా సయేషా నటించింది.
కమెడియన్ అలీ:
అలీ సీమశాస్త్రి( Seema Sastry ) సినిమాలో లంబోధర శాస్త్రిగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశం బాగా రావాలని అలీ ఏకంగా 22 టేక్స్ తీసుకున్నాడట.
18 పేజెస్
2022లో విడుదలైన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “18 పేజెస్”( 18 Pages Movie ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ సినిమాకి కథను సుకుమార్ అందించాడు.పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు.అయితే ఇందులో ప్రతి సీన్ కూడా బాగా రావాలని డైరెక్టర్ ఒక్కో సన్నివేశానికి 25-30 సార్లు టేక్స్ తీసుకున్నాడట.