జైలులో పశ్చాతాపపడుతున్న దర్శన్.. రేణుకాస్వామి ఫ్యామిలీకి అలా సాయం చేయనున్నారా?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో చిత్రదుర్గ రేణుక స్వామి( Renuka Swami ) హత్య కేసు కూడా ఒకటి.అయితే ఈ కేసులో ముఖ్య స్నేహితుడిగా ప్రముఖ హీరో దర్శన్( Hero Darshan ) ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.

 Darshan Help Renukaswamy Family, Darshan, Help Renuka Swamy Family, Renuka Swamy-TeluguStop.com

ప్రస్తుతం అతను బెంగుళూరు లోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు.అయితే తనకు జైల్లో ఉన్న ఆహారం సరిపడక ఆరోగ్యం క్షీనిస్తోందని, అందుకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇవ్వాలి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అయితే దానిని హైకోర్టు నిరాకరించింది.అయితే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ ( pvitra Gowda )మొదటి ముద్దాయి.

Telugu Darshan, Renuka Swamy-Movie

ఈ కేసుకు సంబంధించిన నిందితులు అందరూ నెల రోజుల నుంచి కటకటాల వెనుక ఉన్న విషయం తెలిసిందే.దర్శన్ తో సహా 13 మంది నిందితులు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.కానీ మిగతా నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు.జైల్లో ఉన్న దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.జైలు అధికారులు కూడా ఇదే మాట అంటున్నట్లు సమాచారం.ప్రస్తుతం దర్శన్‌ నుంచి వస్తున్న ప్రతి మాటలో కూడా పశ్చాత్తాపం కనిపిస్తుందని అంటున్నారు.

రేణుకాస్వామి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు కావడంతో ఇప్పుడు ఆయన మరణం వల్ల కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది.

Telugu Darshan, Renuka Swamy-Movie

ఈ విషయం తెలుసుకున్న దర్శన్‌ కాస్త చలించిపోయినట్లు తెలుస్తోంది.రేణుకాస్వామి కుటుంబ సభ్యులకు సహాయం అందించాలని దర్శన్‌ పూనుకున్నారట.ఈ విషయాన్ని రేణుకా స్వామి కుటుంబ సభ్యులతో దర్శన్‌ అనుచరులు చర్చించారట.

అందుకు వారు కూడా అంగీకరించినట్లు సమాచారం.అయితే గర్భంతో ఉన్న రేణుకా స్వామి భార్యకు సాయం చేయడంతో పాటు ఆయన తండ్రి, తల్లికి విడివిడిగా సాయం చేయాలని దర్శన్‌ ఆలోచించాడట.

ఈ వార్త తన అనుచరుల ద్వారా కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ నేపథ్యంలోనే దర్శన్ ను కలవడానికి దర్శకుడు తరుణ్ సుధీర్ అగ్రహార జైలుకు వెళ్లారట.

దర్శన్‌ ని కలిసిన అనంతరం తరుణ్ సుధీర్ మీడియాతో ఇలా మాట్లాడారు.దర్శన్ సర్‌కు ఆరోగ్యం బాగాలేదు.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.నన్ను చూడగానే ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయనకు చెప్పాను.దర్శన్ సార్‌ కు రెండు పుస్తకాలు ఇచ్చాను.

జీవిత పాఠం గురించి తెలిపే పుస్తకంతో పాటు అర్జునుడి గురించి మరొక పుస్తకాన్ని ఆయనకు అందించాను అని తరుణ్ సుధీర్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube