గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉండే తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) అధికారాన్ని సాధిస్తుందని ముందుగా ఎవరు అంచనా వేయలేకపోయారు.ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు నియమించారు.
రేవంత్ ముఖ్యమంత్రిగా ఎంతో కాలం కొనసాగలేరని, ఆయనకు పెద్దగా పాలనా అనుభవం లేకపోవడం , గ్రూపు రాజకీయాలను నెట్టుకు రాలేరని అంతా భావించారు.అయితే రేవంత్ మాత్రం ఎవరూ ఊహించిన విధంగా పాలనలో తన మార్క్ కనిపించే విధంగా చేస్తూ, పార్టీలోని గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టారు .పార్టీలోని అన్ని గ్రూపులకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ .తనను వ్యతిరేకిస్తున్న వారికి సైతం ప్రాధాన్యం ఇస్తూ మెల్లిమెల్లిగా వారిని తమ దారిలోకి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.దీంతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల్లోనూ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.దీంతోపాటు తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ను ఓటమి తర్వాత మరింత బలహీనం చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.
కాంగ్రెస్ ఎంతో కాలం అధికారంలో ఉండదని, త్వరలోనే అది కూలిపోతుంది అనే విమర్శలకు తాళం వేసే విధంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ తమ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు .రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ మరింతగా తెలంగాణలో బలపడుతుందని, ఆయనే సీఎం కుర్చీకి అర్హుడని కాంగ్రెస్ అధిష్టానం కూడా నిర్ణయానికి వచ్చేసినట్టుగానే కనిపిస్తోంది .దీనికి తగ్గట్లుగానే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలానే కష్టపడ్డారు .అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ను బలోపేతం చేస్తూనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై మరింత సానుకూలత ఏర్పడే విధంగా రేవంత్ వ్యవహరిస్తుండడం వంటివన్నీ ఆయనకు బాగా కలిసి వచ్చాయనే చెప్పవచ్చు.
ఇటీవల రుణమాఫీ( Rythu Runamafi ) అమలుకు రేవంత్ శ్రీకారం చుట్టడం, రైతుల ఖాతా సొమ్ములు జమ కావడం వంటివన్నీ జనాల్లోనూ రేవంత్ పై నమ్మకాన్ని కలిగించాయి .ఇప్పటి వరకు ఆయనను తక్కువ అంచనా వేసిన విపక్షాలు సైతం రేవంత్ ను చూసి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక పార్టీలో గ్రూపు రాజకీయాలు అనేవి పెద్దగా కనిపించకపోవడం వంటివి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా రేవంత్ పై మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.రేవంత్ స్థానంలో మరొకరిని సీఎంగా చేస్తారని ఇప్పటివరకు అనేక ఊహాగానాలు వచ్చినా , ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ ను కొనసాగించకుండా మరొకరికి సీఎంగా అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదట.దీంతో ఇప్పట్లో రేవంత్ సీఎం కుర్చీకి ఏ ఢోకా లేనట్టే అన్న విషయం అర్ధం అవుతోంది.