సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కూడా సక్సెస్ సాధించాలనే తహతహలాడుతూ ఉంటారు.అలాగే తీసిన ప్రతి సినిమా కలెక్షన్స్ కొల్లగొట్టాలని భావిస్తారు.
అందుకోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తారు.అయితే ప్రస్తుతం సినిమాల తీస్తున్న కొంతమంది దర్శకులు మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కలెక్షన్స్ పరంగా ఎక్కడ వెనక్కి తగ్గకుండా హిట్స్ అందుకుంటూనే కలెక్షన్స్ ని కూడా పెంచుకుంటూ వెళుతున్నారు.మరి ఇంతకీ ఆ దర్శకులు ఎవరు ? వారు తీస్తున్న సినిమాలు ఏంటి ? వాటి కలెక్షన్స్ వివరాలు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సందీప్ రెడ్డి వంగా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ మొదలుపెట్టిన సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) మొట్టమొదటి సినిమా అర్జున్ రెడ్డితో 51 కోట్ల కలెక్షన్స్ సాధించగా, కబీర్ సింగ్ సినిమాకు 379 కోట్ల రూపాయలను కలెక్షన్స్ గా సాధించాడు.అలాగే ఆ తర్వాత అనిమల్( Animal ) ని మాత్రం 917 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టారు.ప్రస్తుతం అందరూ దృష్టి ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ చిత్రం పైనే ఉంది.దీనికి ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొడతారో చూడాలి.
నాగ్ అశ్విన్
కల్కి సినిమాతో( Kalki Movie ) సంచలన దర్శకుడుగా మారిపోయిన దర్శకుడు నాగ్ అశ్విన్.( Nag Ashwin ) ఈయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి 16 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.ఇక రెండవ సినిమా మహానటి కి 85 కోట్ల రూపాయలు కలెక్షన్స్ గా వచ్చాయి.
చివరగా కల్కి సినిమాకి 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ దక్కాయి.ఇంకా ఈ సినిమా థియేటర్స్ లోనే ఉంది మరిన్ని రికార్డ్స్ సాధించే దిశగా పరుగులు పెడుతోంది.
అట్లీ
అట్లీ ( Atlee )డైరెక్షన్ లో వచ్చిన రాజా రాణి చిత్రానికి 84 కోట్ల రూపాయలు కలెక్షన్స్ గా వచ్చాయి.పోలీసోడు చిత్రానికి 150 కోట్ల రూపాయలు దక్కాయి అలాగే విజయ్ హీరోగా వచ్చిన అదిరింది చిత్రానికి 250 కోట్ల రూపాయలు కలెక్షన్స్ గా రాగా విజయ్ మరో సినిమా 305 కోట్లు చివరగా షారుక్ హీరోగా నటించిన జవాన్ చిత్రానికి( Jawan Movie ) 1000 కోట్ల రూపాయలు వచ్చాయి.