యూఎస్: కోర్ట్‌రూమ్‌లో నేరస్థుడు ఎలాంటి రిక్వెస్ట్ చేశాడో తెలిస్తే...

తాజాగా యూఎస్ కోర్ట్‌రూమ్‌లో ఓ నేరస్థుడు వింత రిక్వెస్ట్ చేశాడు.ఫ్లోరిడాకు చెందిన స్టీవెన్ లారెంజో( Steven Lorenzo ) అనే 65 ఏళ్ల వ్యక్తి జాసన్ గేల్‌హౌస్, మైఖేల్ వాచ్‌హోల్ట్జ్ అనే ఇద్దరు వ్యక్తులను హత్య చేశాడు.అందుకు అతడికి మరణశిక్ష విధించారు.2023, ఫిబ్రవరిలో హిల్స్‌బరో కౌంటీ కోర్ట్‌హౌస్‌లో జరిగిన విచారణలో, న్యాయమూర్తి క్రిస్టోఫర్ సాబెల్లా తీర్పును వెలువరించే ముందు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా అని అడిగారు.అప్పుడు హంతకుడు లారెంజో లేచి, న్యాయమూర్తి, న్యాయవాదులు, హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.తనపై కేసు నమోదు చేసిన న్యాయవాదులపై తనకు ఎటువంటి కక్ష లేదని తెలిపాడు.

 U If You Know What Kind Of Request The Criminal Made In The Courtroom, Steven L-TeluguStop.com

ఆ తర్వాత, తాను మరణశిక్షను కోరుకుంటున్నట్లు న్యాయమూర్తికి తెలిపాడు.తాను ఎందుకు మరణశిక్షను కోరుకుంటున్నాడో కూడా వివరించాడు.

లారెంజో తన వయసును దృష్టిలో పెట్టుకుని, మరణశిక్ష ఇవ్వాలని కోరాడు.తనకు మరణశిక్ష విధించాక దాదాపు 10 నుంచి 15 ఏళ్లు జైలులో గడపాల్సి వస్తుందని, అది తనకు అర్థరహితమైన సమయమని చెప్పాడు.త్వరగా మరణించి, మళ్లీ పునర్జన్మ ఎత్తాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.అయితే, న్యాయమూర్తి సాబెల్లా లారెంజో కోరిక తన తీర్పును ప్రభావితం చేయదని స్పష్టం చేశారు.లారెంజో రివర్స్ సైకాలజీ ప్రయోగిస్తున్నాడేమో అని అనుమానించినప్పటికీ, తన తీర్పులో లారెంజో కోరికను పరిగణనలోకి తీసుకోబోనని తెలిపారు.

ఆ తర్వాత, న్యాయమూర్తి బాధితులైన జాసన్ గేల్‌హౌస్ మరియు మైఖేల్ వాచ్‌హోల్ట్జ్ తల్లులైన పామ్ విలియమ్స్, రూత్ వాచ్‌హోల్ట్జ్‌ల సాక్ష్యాన్ని ప్రస్తావించారు.వారిద్దరినీ చాలా బలమైన మహిళలుగా అభివర్ణించారు.పామ్ విలియమ్స్ మాట్లాడుతూ, ” ఈ భయంకరమైన నేరాలకు మరణశిక్షే నీకు తగిన శిక్ష” అని చెప్పింది.

నివేదికల ప్రకారం, స్టీవెన్ లోరెంజో జాసన్ గేల్‌హౌస్ (26), మైఖేల్ వాచోల్ట్జ్ (26) అనే ఇద్దరు యువకులను టంపా( Tampa )లోని తన ఇంటికి రప్పించి, అక్కడ అతను వారిని హింసించి చంపాడు.వారి మృతదేహాలు నగరం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న డబ్బాల్లో కనుగొనబడ్డాయి.

లోరెంజో వారి మృతదేహాలను పారవేయడానికి ముందు గేల్‌హౌస్, వాచోల్ట్జ్‌లను మత్తుమందు ఇచ్చి, హింసించి చంపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube