ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) వైసీపీ తరపున ప్రచారం చేసిన రోజు నుంచి బన్నీ టార్గెట్ గా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ జరుగుతున్నాయి.తాజాగా బన్నీ అభిమానులను కొడతాడంటూ ఫేక్ ప్రచారం వైరల్ అవుతోంది.
ఎలాంటి ఆధారాలు లేకుండా బన్నీ గురించి ఇలాంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు రైట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన చిన్నాచితకా ఆర్టిస్టులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి దుష్ప్రచారం గురించి బన్నీ వేగంగా స్పందిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా కూడా ఏకంగా నాలుగు నెలల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ పుష్ప2( Pushpa2 ) సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా అదరగొడుతోందని తెలుస్తోంది.
![Telugu Allu Arjun, Jana Sena, Pawan Kalyan, Pushpa, Tollywood-Movie Telugu Allu Arjun, Jana Sena, Pawan Kalyan, Pushpa, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/allu-arjun-tollywood-negative-campaign-YCP-Pushpa-2-tdp-pawan-kalyan-jana-sena.jpg)
పుష్ప ది రూల్ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తమే ఖర్చు చేసిందని తెలుస్తోంది.బన్నీ పాత్రకు సంబంధించి క్లైమాక్స్, ఒక సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని భోగట్టా.పుష్ప ది రూల్ సినిమా బన్నీ కెరీర్ లోనే స్పెషల్ మూవీగా నిలవడం గ్యారంటీ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
![Telugu Allu Arjun, Jana Sena, Pawan Kalyan, Pushpa, Tollywood-Movie Telugu Allu Arjun, Jana Sena, Pawan Kalyan, Pushpa, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/social-media-allu-arjun-tollywood-negative-campaign-YCP-Pushpa-2.jpg)
పుష్ప ది రూల్ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం అద్భుతంగా ఉన్నాయని సమాచారం అందుతోంది.ఫహద్ ఫాజిల్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల బ్యాలెన్స్ ఉందని భోగట్టా.పుష్ప2 సినిమా నిడివి సైతం ఒకింత ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది.అల్లు అర్జున్ తన గురించి జరుగుతున్న నెగిటివ్ ప్రచారం విషయంలో ఒకింత ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.