ఈ యంగ్ డైరెక్టర్స్ భారీ సక్సెస్ కొడితే పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్స్ గా మారుతారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లుగా పేరు సంపాదించుకున్న చందు మొండేటి, ప్రశాంత్ వర్మ ( Chandu Mondeti, Prashanth Verma )లాంటి డైరెక్టర్లు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ మీద మరోసారి కన్నేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఇంతకుముందు చందు మొండేటి కార్తికేయ 2 సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు.

 Young Directors Become Hugely Successful, Will They Become Star Directors In Pa-TeluguStop.com

ఇక పాన్ ఇండియాలో తను కూడా ఒక స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు ఉండడమే కాకుండా తనను తనకంటూ ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం అయితే చేశాడు.ఇక అందులో భాగంగానే ఇప్పుడు నాగచైతన్య తో తండెల్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో కూడా మరోసారి సూపర్ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఆయన చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని సినిమా యూనిట్ నుంచి మంచి ఆశ భావం అయితే వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న ప్రశాంత్ వర్మ కూడా ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

 Young Directors Become Hugely Successful, Will They Become Star Directors In Pa-TeluguStop.com

ఇప్పుడు జై హనుమాన్ ( Jai Hanuman )అనే సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని కొట్టినట్టైతే ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం అయితే వస్తుంది.మరి దానికి అనుగుణంగా ఆయన ఏ మాత్రం తీసుకోకుండా ఈ సినిమాని కూడా రూపొందించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.చూడాలి మరి వీళ్లిద్దరూ ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ కొడతారు అనేది… ఇక మొత్తానికైతే వీళ్ళు కూడా పాన్ ఇండియా లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే తెలుగు నుంచే ఉన్న పాన్ ఇండియా డైరెక్టర్లలో వీళ్ళు కూడా చేరిపోతారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube