Mangal Yog: ఫిబ్రవరి నెలలో ఏర్పడిన మంగళ యోగం.. ఈ రాశుల వారి జీవితాల్లో శుభ ఫలితాలు..!

ఈ నెలలో ఈ రాశుల వారి జీవితాలలో కనివిని ఎరగని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.ఉద్యోగం, వృత్తి, హోదా, ఆదాయం, వ్యాపారాలు వంటి విషయాలలో తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి.

 Mars Transit In Capricorn Golden Time For The People Of These Zodiac Signs-TeluguStop.com

ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు కుజుడు మకర రాశిలో( Capricorn ) అంటే తన ఉచ్ఛ రాశిలో సంచరించడం జరుగుతుంది.దీనివల్ల ఈ రాశులకు తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి.

మరి ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి అధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉచ్చ పట్టడం దశమ కేంద్రంలో ఉచ్ఛ పట్టిన కారణంగా దిగ్బలం కూడా ఏర్పడడం వల్ల ఈ రాశుల వారికి తప్పకుండా విపరీత రాజయోగం( Rajayogam ) పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వృత్తి,ఉద్యోగాల పరంగానే కాకుండా సామాజికంగా కూడా స్థాయి హోదా పెరిగే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి పంచ మహా దశమాధి పతిగా కుజుడు, పూర్ణ శుభుడు అయినందువల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా అందలాలూ ఎక్కించడం జరుగుతుంది.

Telugu Astrology, Capricorn, February, Golden Time, Horoscope, Kuja, Mangalyog,

పిల్లల విషయంలోనూ, వృత్తి, ఉద్యోగాల విషయంలోనూ అనేక శుభ ప్రమాణాలు వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి.ఇంకా చెప్పాలంటే వృశ్చిక రాశికి( Scorpio ) అధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో చేపట్టడం అనేక శుభవార్తలను తీసుకురావడం జరుగుతుంది.ఊహించని స్థాయిలో ఆదాయం పెరుగుతుంది.అలాగే ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు.ధనస్సు రాశి వారికి పంచమ అధిపతిగా కుజుడు పూర్ణ శుభుడు అయినందువల్ల ఈ రాశి వారి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.

Telugu Astrology, Capricorn, February, Golden Time, Horoscope, Kuja, Mangalyog,

ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది.పిల్లల నుంచి అన్ని శుభవార్తలు వింటారు.మకర రాశికి శత్రుదా లాభాధి పతి అయిన కుజుడు ఈ రాశిలో ఉచ్ఛపడుతుండడం వల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది.

దాదాపు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి పరిస్థితి ఉంటుంది.వృత్తి, ఉద్యోగాలలో కాకుండా సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది.అలాగే మీనా రాశికి( Pisces ) ధన భాగ్యాధిపతి అయిన కుజుడు లాభ స్థానంలో ఉచ్చ పట్టడం వల్ల అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది.ఆస్తిపాస్తుల విలువలు పెరుగుతాయి, పెద్దలనుంచి స్థిరాస్తి తెలిసి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube