కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని( Sri Venkateswara Swamini ) దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు.సామాన్య భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) ఎప్పుడెప్పుడు 300 రూపాయల టికెట్లు విడుదల చేస్తారా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక శ్రీవారి అర్జిత సేవల టికెట్ల కోసం పోటీ పడుతుంటారు.శ్రీవారి సుప్రభాతం, తోమాల అర్చన, అష్టదళపాదపద్మారాధన, అర్జితా సేవలు, కళ్యాణోత్సవం, అర్జిత బ్రహోత్సవాలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

శ్రీవారిని దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు పోటీ పడుతుంటారు.శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు నెలల పాటు వేచి చూస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా స్వామి వారి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి అర్జిత సేవల దర్శన టికెట్లు కూడా విడుదల చేస్తుంది.ఇందులో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం జూన్ 19వ తేదీన విడుదల చేయనుంది.

తిరుమల శ్రీ వారి భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ లో వీటిని విడుదల చేస్తూ ఉంది.సెప్టెంబర్ నెలలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల అర్చన, అష్టాదళ పాదపద్మనాధనా అర్జిత సేవల కోసం ఆన్లైన్ లో జూన్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.కళ్యాణోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను జూన్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.సెప్టెంబర్ నెల కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, దీపాలంకరణ సేవ, వర్చువల్ సేవలు అదే విధంగా వాటికి సంబంధించిన దర్శనానికి సంబంధించిన టికెట్లు కూడా జూన్ 22వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు.